Viral Video సోషల్ మీడియా ఓపెన్ చేస్తేనే చాలు రోజుకో వింత, రోజుకో విశేషం కనిపిస్తూనే ఉంటాయి.. ముఖ్యంగా జంతువులు చేసే పనులు.. అవి చేసే వింత చేష్టలు చూస్తుంటే నవ్వు ఆగదు. ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి. అయితే తాజాగా ఓ ఏనుగు చేసిన పని నేటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తుంది..
ఓ భారీ ఏనుగు ఒక బిల్డింగ్ లోకి ఎలా వెళ్ళిందో మాత్రం తెలియదు.. అయితే అందులోంచి బయటికి రావడానికి మాత్రం నానా తిప్పలు పడింది. ఆ బిల్డింగ్ లో ఒక డోర్ నుంచి బయటకు రావటానికి అవస్థలు పడుతున్న ఆ ఏనుగుని ఓ ఫారెస్ట్ అధికారి వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ చిన్న డోర్ నుంచి అంత భారీ ఏనుగు బయటికి రావటానికి ఎన్నో అవస్థలు పడి.. చివరికి బతుకు జీవుడా అంటూ ఎలాగోలా బయటపడింది. అయితే ఈ ప్రయత్నంలో ఆ ఏనుగు చేసే పనులు చూస్తున్న వాళ్ళందరికీ నవ్వు ఆగటం లేదు..
ఇండియన్ ఫారెస్ట్ అధికారి సాకేత్ బరోలా ఈ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేయగా కామెంట్ల వర్షం కురుస్తుంది.. అంతేకాకుండా కిందన ఇంత కంటే గొప్ప క్వాలిటీ కంట్రోలర్ ను మీరు చూసి ఉండరు అని నేను బెట్ వేస్తున్న అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.. ఈ వీడియో చూసిన వాళ్లంతా ఏనుగు భలే ఇరుక్కుపోయింది గా.. అయ్యో గజరాజా నీకు ఎంత కష్టం వచ్చింది.. హ్యాపీ ఎండింగ్ అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు..
I bet you may not have seen a better quality control inspector than this one. 🥰
VC: SM @susantananda3 @AwanishSharan @arunbothra @supriyasahuias @deespeak pic.twitter.com/Oz4OaCZFdl— Saket Badola (@Saket_Badola) September 12, 2022