బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ న్యూడ్‌గా తీసిన ఫొటో షూట్ ఎంత రచ్చ అయిందో అందరికీ తెలుసు. ప్రత్యేకంగా దాని గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు కూడా. స్టార్ హీరోగా ఉంటూ రణ్‌వీర్ చేసిన దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అదే సమయంలో కొంతమంది ఆయనకు సపోర్టు చేశారు కూడా.
ఇప్పుడు ఓ నటి కూడా దాదాపు ఆయన చేసినట్లే చేసింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్‌శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘ఖత్రోన్ కె ఖిలాడీ 12’ ఫేమ్ ఎరికా ప్యాకర్డ్ తాజా సంచలనానికి తెరలేపారు. తన టాప్‌లెస్ ఫొటోను ఇన్‌స్టాలో ఆమె పోస్ట్ చేశారు. ‘రణ్‌వీర్‌కు కంపెనీ ఇస్తున్నా.. కానీ మీరు నా బమ్స్ చూడలేరు’ అంటూ ఎరికా అక్కడ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చేసిందండోయ్. ఎరికా చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు.