ఎల్.విజయలక్ష్మి బాల నటిగా సిపాయి కూతురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమై ఆ తరువాత, జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తన శాల, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, రాముడు – బీముడు, భక్త ప్రహ్లాద వంటి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఊర్రూతలూగించి ఎన్నో అద్భుతాలు సృష్టించిన అలనాటి అందాల తార ఎల్. విజయలక్ష్మి, 50 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీ కి దూరం గా ఉన్నారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తో సుమారు15 సినిమాలకు పైగా తను నటించి సినీ ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచి పోయారు.
50 సంవత్సరాల తర్వాత మొదటి సారిగా తెనాలి లో జరుగుతున్న, లెజెండరీ నటుడు, యన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారంనాడు తెనాలిలో ఆమెకు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా సోమవారంనాడు హైదరాబాద్‌లో ఆమెను వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలపాలని బాలకృష్ణ భావించారు. అందులో భాగంగా సినీ ప్రముఖులు సమక్షంలో నందమూరి బాలకృష్ణ ఎఫ్.ఎన్.సి.సి.లో ఆమెకు గౌరవ సత్కారం చేశారు.
అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ… శకపురుషుడి శతాబ్డి పురస్కార గ్రహీత ఎల్. విజయలక్ష్మిగారికి శిరస్సు వచ్చి వందనాలు సమర్పిస్తున్నాను. 60 దశకంలో చలనచిత్ర పరిశ్రమను ముందుకు నడిపిన అతిరథులు నిర్మించిన చిత్రాల్లో ఆమె నటన ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆ అధినేతలు సురేష్‌బాబు, తమ్మారెడ్డి, పరుచూరిగోపాలకృష్ణ, బసిరెడ్డివంటివారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అసలు శకపురుషుడి శతాబ్డి ఉత్సవాలకు అంకురార్పణ చేసింది కొమ్మినేని వెంకటేశ్వరరావు, బుర్రా సాయిమాధవ్, ఆలపాటి రాజా, వైవి.ఎస్. చౌదరి వంటివారు ముందుండి నడిపారు. నన్ను గౌరవాధ్యక్షునిగా పెట్టి తెనాలిలో పలు కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం. సినిమాలేకాక అటు రాజకీయ, ప్రజా సేవ రంగంలో కూడా సేవలు చేసిన వారిని సత్కరించుకొనే మహత్కర కార్యక్రమం ఇది. అందులో భాగంగా విజయలక్ష్మిగారికి ఇవ్వడం జరిగింది.
https://youtu.be/KPIC2UXnMeY
ఇక చరిత్ర పుటల్లోకి వెళితే ఎర్నాకుళంలో పెట్టి నాట్యం నేర్చుకుని 59 నుంచి 69వరకు పదేళ్ళ సుదీర్ఘ ప్రయాణం సినిమారంగంలో చేశారు. వందకుపైగా సినిమాల్లో నటిస్తే అందులో 60కి పైగా నాన్నగారితో నటించారు. నాట్యంలో పలువురు నటీమణులు వున్నా, ఎల్. విజయలక్ష్మిగారు కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, జావలి వంటి ఎన్నో నాట్యాలు ప్రదర్శించారు. అలా కళామతల్లి సేవ చేశారు. ముఖ్యంగా నటీనటులు ఒక స్థాయికి చేరుకున్నాక సినీ ప్రయాణం ఆగిపోతే ఒంటరితనానికి గురికావడం సహజం. కానీ ఆమె నాన్నగారిని స్పూర్తిగా తీసుకుని అమెరికా వెళ్ళి సి.ఎ. చదివి వర్జీనియా యూనిర్శిటీలో బడ్జెట్ మేనేజర్‌గా వుండడం.చాలా విశేషం. ఇప్పుడు జూంబా డాన్స్ కూడా నేర్చుకుంటున్నారు. మనిషికి పనిలేకుండా ఖాళీగా వుంటే రోగం. ఆమె మహిళా సాధికారికతకు ప్రతీక. ఆమె ఎక్కిన మెట్లును భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి. ఆవిడను ఇక్కడకు తీసుకు వచ్చేలా చేసిన వైవిఎస్. చౌదరికి ధన్యవాదాలు తెఇయజేస్తున్నా అన్నారు.