Crime ఓ నకిలీ కలెక్టర్ చేసిన అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.. అమాయక ప్రజలను ఆసరాగా తీసుకొని ఎన్నో దారుణాలకు పాల్పడిన ఓ వ్యక్తి సబ్ కలెక్టర్ అవతారం ఎత్తటం విశేషం.. ఎందరో ప్రముఖులు తనకు తెలుసు అంటూ.. ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేశాడు ఈ కేటుగాడు.
మోసం చేసే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్క రకంగా ఉంటారు అయితే ఇక్కడ ఓ వ్యక్తి ఏకంగా సబ్ కలెక్టర్ అవతారం ఎత్తాడు విలాసాలకు అలవాటు పడిన ఆ వ్యక్తి అక్రమాలకు పాల్పడి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు చివరికి ఏం చేయాలో ఆలోచించి సబ్ కలెక్టర్ అవతారం ఎత్తడు.. తను చాలా మంది ప్రముఖులు తెలుసు అంటూ ప్రభుత్వ ఉద్యోగాలు వేయిస్తా అంటూ అమాయక ప్రజలను ఆసరాగా తీసుకున్నాడు ఇందులో ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసిన ఈ వ్యక్తి లక్షల్లో కాల్ చేశాడు.. ఓ మహిళకు వల వేయబోయి అదే వలలో చిక్కుకున్నాడు ఈ కేటుగాడు.
విజయవాడ చిట్టీనగర్ కు చెందిన పిల్లా వెంకట రాజేంద్ర CRDA లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సబ్ కలెక్టర్ అవతారమెత్తాడు. పోలీసు ఉన్నతాధికారులతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని ప్రజలు నమ్మించాడు. ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేశాడు ఈ కేటుగాడు. ఈ నేపథ్యంలో బాధితుల నుంచి దాదాపు 80 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది అయితే ప్రభుత్వం ఇప్పిస్తానని ఓ మహిళ నుండి తొమ్మిది లక్షలు వసూలు చేస్తుండడంతో ఆ మహిళ అసలు విషయాన్నీ పసగట్టింది.. ఈ నేపథ్యంలో తన డబ్బు తనకు ఇవ్వాలని వాదించిన ఓ మహిళతో గొడవకు దిగాడు ఈ నకిలీ కలెక్టర్.. అయితే ఆ మహిళ తనకు డబ్బు అవసరం ఎంతో ఉందని చెప్పినా వినకపోవడంతో గ్రామస్తుల సహాయంతో పక్కగా ప్లాన్ వేసి ఈ నకిలీ కలెక్టర్ ను పోలీసులకు పట్టించింది అయితే ఇంత జరిగాక ఆ మహిళ నుంచి తాను ఆ డబ్బును వడ్డీకి తీసుకున్నానని ఇలాంటి పనులు ఏమి చేయలేదని అనడం విశేషం..