Crime కన్న కూతురి పై ఓ కసాయి తండ్రి దారుణానికి ఒడిగట్టాడు.. ఎక్కడా వినలేని విధంగా దేశం నివ్వెర పొయినట్లు చేశాడు..
కాపాడాల్సిన తండ్రే కసాయిగా మారాడు.. మనిషి మానవత్వం అనే విషయాలు కూడా మర్చిపోయి ప్రవర్తించాడు.. మానసిక వికలాంగురాలైన కూతురిపై ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. నిస్సహాయ కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు..
కేరళలోని పతనంటిట్టా జిల్లాలోని ఓ గ్రామంలో 13 ఏళ్ల మానసిక వికలాంగ బాలిక, ఆమె తండ్రితో కలిసి నివస్తుంది. ఆమెకు తల్లి లేదు. భార్యకు దూరమైన అతడు..ఇదే సాకుగా తీసుకుని ఆ నిస్సహాయ కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మతి స్థిమితం సరిగా లేని కూతురిపై కిరాతకం ప్రదర్శించాడు.. తండ్రి పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక ఆ కూతురు తప్పించుకుని పక్క ఇంటికి వెళ్లింది. నిస్సహాయంగా రోధిస్తున్న ఆ బాలికను స్థానికులు చేరదీసి.. అసలు విషయం ఆరా తీశారు. బాధితురాలు తండ్రి చేసిన దారుణాల గురించి చెప్పగా.. . అనంతరం స్థానికులు, స్కూల్ టీచర్ సాయంతో చైల్డ్‌లైన్ కార్యకర్తలకు సమాచారం అందించారు. నిందితుడిపై 2020లో కేసు నమోదైంది. తన కుమార్తెను లైంగిక ప్రలోభాలకు గురిచేసిన తండ్రిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ప్రాసిక్యూషన్ అభియోగాన్ని కోర్టు సమర్థిస్తూ పోక్సో చట్టం కింద అతడిని దోషిగా నిర్ధారించింది. 107 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 4 లక్షల జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని బాధితురాలికి పరిహారంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.