Health ఈరోజుల్లో చాలామంది మహిళలను వేధించే సమస్య పీసీఓడీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు నుంచి 20 శాతం మంది మహిళలు ఈ పీసీఓడీతో బాధపడుతున్నారు.. ఈ సమస్య వల్ల చాలామంది మహిళలకు పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇది ఒక్కటి మాత్రమే కాకుండా పీసీఓడీ ఉన్నవారు వున్న వారు సమస్యలతో బాధపడుతూ ఉంటారు.
ఈ సమస్య వల్ల నెలసరి క్రమం తప్పడం, సంతానలేమి, విపరీతంగా బరువు పెరగడం, మూడ్ స్వింగ్స్, ఒత్తిడి, ఆందోళనలు, విపరీతంగా జుట్టు రాలిపోవడం, అవాంఛిత రోమాలు ఎక్కువగా రావడం, మొటిమలు.. వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఈ పీసీఓఎస్ కనుక దీర్ఘకాలం ఉంటే.. గుండె జబ్బులు, గుండెపోటు, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.
అయితే చాలామంది ఈ పీసీఓడీకి ఎన్నో హాస్పిటల్లో తిరిగి మాత్రలు వాడుతుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే వీటన్నిటికన్నా సరైన డైట్ ప్లాన్.. ఒంటికి తగిన వ్యాయామం ఉంటే పీసీఓడీని తేలికగా ఎదుర్కోవచ్చని తెలుస్తుంది.. స్వీట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.. మొత్తంలో ఉప్పు మసాలాలు తీసుకోరాదు.. బేకరీ పదార్థాలు కూడా దూరంగా ఉండాలి. పాల పదార్థాలు అందరికీ మంచివైనప్పటికీ ఈ పీసీఓడీ సమస్య ఉన్న వాళ్లు పాల పదార్థాలు తక్కువగా తీసుకోవడం చాలా మంచిది.. అలాగే మాంసాహార పదార్థాలు దానికి సంబంధించినవి దూరంగా ఉంచితే మంచిది