Gagan Narang Shooting Academy Hyderabad, Rifle Association of india, Cheers For india Tokyo Olympics 2020, Minister Srinivas Goud, Telangana Sport News, Telugu World Now,
SPORTS NEWS: గగన్ నారంగ్ షూటింగ్ అకాడమీ లో టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొనే షూటింగ్ క్రీడాకారులకు చీర్స్ ఫర్ ఇండియా టోక్యో ఒలంపిక్స్ 2020: మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మరియు రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ మెంబర్ హైదరాబాద్ లోని గచ్చిబౌలి లోని గగన్ నారంగ్ షూటింగ్ అకాడమీ లో టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొనే షూటింగ్ క్రీడాకారులకు చీర్స్ ఫర్ ఇండియా టోక్యో ఒలంపిక్స్ 2020 పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను సన్మానించారు. అనంతరం రైఫిల్ షూటింగ్ లో మంత్రి పాల్గొన్నారు. గగన్ నారంగ్ గారు సూచించిన రెండు టార్గెట్ లను మొదటి ప్రయత్నం లొనే పూర్తి చేసి షూటింగ్ క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. ఒలంపిక్స్ లో పతాకం సాధించి నేడు దేశ వ్యాప్తంగా షూటింగ్ లో శిక్షణ ను ఇస్తున్న ఒలంపియన్ గగన్ నారంగ్ అకాడెమీ హైదరాబాద్ అకాడెమీ లో దేశవ్యాప్తంగా టోక్యో ఒలంపిక్స్ కు ఎంపికైన 15 మంది షూటింగ్ క్రీడాకారులు హైదరాబాద్ లోని SATs శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారన్నారు. చిన్న చిన్న దేశాలు ఒలంపిక్స్ లో ఎన్నో పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు పొందుతున్నాయన్నారు. మన దేశంలో క్రీడాకారులు కూడా తమ శక్తి సామర్ధ్యాలను చాటి ఒలంపిక్స్ లో పథకాలు సాధించి దేశానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి క్రీడాకారులకు, కోచ్ లకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం లో క్రీడల అభివృద్ధి కి అనేక చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ రూపకల్పన కు క్యాబినెట్ సబ్ కమిటీ ని నియమించారన్నారు. ఒలంపిక్స్ లో పతకాలు సాధించే క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాలను ఘనంగా పెంచామన్నారు. ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలను నిర్మించా మన్నారు. ఒలంపిక్స్ లో పతకాలు సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఒలంపిక్స్ మెడలిస్ట్ గగన్ నారంగ్, స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు దరియస్ చెన్నై, రాష్ట్ర రఫైల్ అసోసియేషన్ కార్యదర్శి కిరణ్, పరిపాలన అధికారి అలెస్జెండర్, క్రీడాకారులు ఇషా సింగ్, అంజు,ధనుష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.