Political గంట శ్రీనివాసరావు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరుతారని గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతుంది.. అయితే తాజాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రస్తుత ఈ విషయం చర్చనీయాంశంగా మారింది..
గంట శ్రీనివాసరావు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. యు మేరకు ఆయన వైఎస్ఆర్సిపి లో చేరటం ఖాయమని.. దీనికీ ఆ పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది… అయితే తాజాగా సోషల్ మీడియాలో వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తాను పార్టీ మారడం లేదని.. టీడీపీలో కొనసాగుతానని గంట శ్రీనివాసరావు అన్నట్లు తెలుస్తుంది.
ఈ వీడియో గంటా పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చారని.. టీడీపీలో కొనసాగుతానని చెబుతున్నట్లు తెలుస్తుంది. ‘నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు చంద్రబాబు గారితోనే నా ప్రయాణం.. తెలుగుదేశం పార్టీలోనే ఉంటా.. తెలుగుదేశం పార్టీ విజయం కోసం పని చేస్తా.. సోషల్ మీడియాలో ఏవేవో రాస్తుంటారు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎంత ఆయన తెలుగుదేశం లోనే కొనసాగుతారని అందరికీ క్లారిటీ వచ్చేసింది.. ఇప్పటి వరకు చాలా రోజులుగా ఆయన వైసీపీలో చేరతారని వార్తలు వినిపించాయి. కానీ ఈ వీడియోతో అసలు విషయం క్లారిటీ వచ్చేసింది. ఇక ఆయన టీడీపీలోనే కొనసాగుతారని… ఏట్టి పరిస్థితుల్లోనూ అధికార వైకాపా వైపు వెళ్లరని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.. టీడీపీ శ్రేణులు.