Go Sena, Go Maha Kshetram, Yuga Tulasi Foundation, Bhakthi News, Justice Nuthalapati Venkata Ramana, TTD K Shiva Kumar, teluguworldnow.com,
BHAKTHI NEWS: “గోవుని జాతీయ ప్రాణి”గా ప్రకటించాలంటూ భారత ప్రధాన న్యాయమూర్తి “జస్టిస్ శ్రీ ఎన్.వి.రమణ”కు వినతి పత్రం.
“గోవుని జాతీయ ప్రాణి”గా ప్రకటించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి: భారత ప్రధాన న్యాయమూర్తి “జస్టిస్ శ్రీ ఎన్.వి.రమణ” కు యుగ తులసి చైర్మన్ శ్రీ కె. శివ కుమార్ వినతి పత్రం.
గో హింస ఆగాలని, గో హత్యలు ఆపాలని, కబేళాలు మూసివేయాలని, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఎన్.వి.రమణకు యుగ తులసి, గో సేన ఫౌండేషన్స్ చైర్మన్, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ కొలిశెట్టి శివ కుమార్ విజ్ఞప్తి చేసారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఎన్.వి.రమణకు శ్రీ కొలిశెట్టి శివ కుమార్ వినతి పత్రం అందజేశారు. గో హింస ఆగాలని, గో హత్యలు ఆపాలని, కబేళాలు మూసివేయాలని, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానములు ఇప్పటికే తీర్మానం (నెం.426, తేదీ: 27.02.2021) చేసిన విషయాన్ని శ్రీ కె శివ కుమార్ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఎన్.వి. రమణ దృష్టికి తీసుకువచ్చారు.