Viral Video మూగజీవాలకు మనుషులకంటే ఎక్కువగా ప్రేమ అభిమానాలు ఉంటాయని అంటారు అలాగే అవి ఎప్పటికప్పుడు వాటిని నిరూపించుకుంటూనే ఉంటాయి ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరిగినా అది వైరల్గా మారుతూనే ఉంది పెంపుడు జంతువులు మూగజీవాలకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. అలాగే తాజాగా ఓ మేక చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
కాన్పూర్ లో ఓ మేక చేసిన పని ప్రస్తుతం వైరల్ గా మారింది.. చుట్టు ఉన్న వాళ్ళని ఎవర్ని పట్టించుకోకుండా నేరుగా దేవుడు ఎదురుగా వచ్చి మేక చేసిన పనికి అందరూ నోరు ఎలా పెట్టారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చర్చనీ అంశమైంది.. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలోని బాబా ఆనందేశ్వర్ ఆలయంలో సాయంత్రం వేళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహిస్తున్న సమయంలో ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వచ్చిన ఓ మేక దేవునికి వంగి నమస్కరించింది అంతేకాకుండా ఇతర భక్తులతో కలిసి శివునికి ప్రార్ధన చేసింది చుట్టూ ఎంత మంది జనాలు ఉన్నా వారు ఎవరిని పట్టించుకోకుండా ఎంతో తీక్షణంగా మోకాళ్లపై నిలబడి తదేకంగా దేవునికి దండం పెట్టింది అంత ఎదురుగా దేవుడికి వచ్చి ఎలా దండం పెట్టగలిగింది అనే విషయం అందరికీ పెద్ద ప్రశ్నగానే మారింది….. అచ్చం మనుషులు చేసినట్టు శివుడిని మొక్కుకుంది. దాంతో అక్కడున్న వారంతా మేక భక్తిని చూసి నోరెళ్లబెట్టారు. ఆ మేక భక్తిని చూస్తూ అదంతా దేవుడు మహిమ కాకపోతే ఇంకేంటి అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్లంతా.. ఓం నమశివాయ.. అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు..
कानपुर के आनंदेश्वर मंदिर में बकरे का अनोखा अंदाज, बाबा को झुक-झुककर किया प्रणाम, श्रद्धालुओं की तरह टेका माथा#kanpur #Kanpurnews #Anandeshwarmandir #Hinduism #kanpurtemple #Uniquevideo pic.twitter.com/AjPTuqfMxF
— Journalist Prabhat Kashyap (@Prabhat_1090) October 9, 2022