Health Tips:మహమ్మారి కరోనా వలన కొన్ని కోట్ల ప్రాణాలు పోయిన విషయం అందరికీ తెలిసినప్పటికీ ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం పై శ్రద్ధ కూడా పెరిగిందని చెప్పుకోవాలి. మనకి సరిపోయినంత ఇమ్యూనిటీ ఉంటే ఎటు వంటి రోగాలు మనకు దరి చేరవని చెప్పడంలో సందేహమే లేదు. ఇందు కొరకు వైద్యులు పచ్చి కూరగాయలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంలో ఎటువంటి డొక ఉండదని తెలుపుతున్నారు. అయితే క్యారెట్ లో ఎన్నో సుగుణాలు ఉన్న విషయం తెలిసిందే. సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు క్యారెట్ ను సాలడ్స్ లో తీసుకోవడం అందరికీ తెలిసిన విషయమే అయితే సాలడ్స్ కంటే కూడా క్యారెట్ ని జ్యూస్ రూపంలో తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి అవి తెలుసుకుందామా…
పరగడుపున ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్గా తీసుకోవడం ద్వారా విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. అలానే రక్తం శుద్ధి చేయడంలో కూడా క్యారెట్ జ్యూస్ చక్కగా ఉపయోగపడుతుంది. చర్మం కాంతివంతంగా మెరిసేలా క్యారెట్ జ్యూస్ ఎంతగానో సహాయపడుతుంది. నిరంతరం తగ్గుతో దగ్గు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగితే దగ్గు సమస్య నుండి ఉపశమనం పొందుతారు.
చిగుళ్ల వెంట రక్తస్రావం జరిగే వారికి క్యారెట్ మంచి ఉపశమనాన్ని అందించడం జరుగుతుంది. క్యారెట్ జ్యూస్ తీసుకోవడం ద్వారా చిగుళ్ల వెంట రక్తస్రావం తగ్గిపోవడం జరుగుతుంది అలానే బలమైన చిగుళ్ళను తమ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో మొటిమల సమస్యలతో స్త్రీలు పురుషులు బాధపడుతున్నారు. రోజు ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగితే మొటిమల సమస్య అనేది మటుమాయం అవుతాయి. అధిక బరువు తగ్గడంలో క్యారెట్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.