‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ by సీనియర్ జర్నలిస్ట్ ఆది
మహేష్ ని మడత పెట్టి గుంటూరు కారం కలిపి కొడ్తే !
పదే పదే కరీం బీడీలు కాల్చుటా.. కొండొకచో వాటిని నమిలివేయుట.. ఆ సెట్టు కాని సెట్టులో మాస్ లుక్కులు కొట్టాలని చూచుట.. త్రివిక్రం నేను బీ మాస్ డైరెక్టరే అన్న కోణంలో ఎలివేషన్లనిచ్చుట.. వగైరా వగైరాలన్నిటినీ కలిపి చూస్తే.. ఫస్ట్ నాకేం అర్ధమయ్యిందంటే.. ఆ శివరాత్రి రోజున సుకుమార్ పుష్ప.. కత మొదట ఈ సింగిల్ ఎక్స్ ప్రెషనిస్టుకే చెప్పాడనీ. వామ్మోఅంత మాసా? అంత యాటిట్యూడా? మనకసలు అలవాటే నేదుగా.. అన్నాడనీ. దీంతో అదే రోజు రాత్రి.. అదే కారేసుకుని వెళ్లి.. అదే కథను అల్లు వారి అర్జునుడికి చెప్పాడనీ.. ఆ అర్జునుడు వెంటనే ఓకే అన్నాడనీ.. చకచక జరిగిపోయాయనీ అంటారు. పుష్ప రిలీజ్ తర్వాత ఇదే స్టోరీ మహేష్ బాబు అయితే.. చేసుండలేడెహె.. అనే కామెంట్లు చాలానే వినిపించాయ్.
ఇప్పటికీ ఈ బుర్రిపాలెం బుల్లెబ్బాయ్ క్లాసే తప్ప.. మాస్ ఓరియెంటేషన్ కి ఏమంత సూటవడనే చెప్పాలి. ఒక వేళ అలాంటివి ఏవైనా చేసున్నా.. వాటిని వదిలేసి చాలా కాలమే అయ్యింది. ఒక్కడు, పోకిరి తర్వాత మహేష్ బాబు ఖాతాలో మెరిసిన మాస్ మషాళా ఒక్కటీ లేదు. అతడు అన్నదొకటి ఉన్నా.. అది కూడా టూ క్లాస్ గా అవతరించిందే తప్ప.. ఏమంత మాస్ కాదు. ఇక నేనొక్కడినే సంగతి సరే సరి. దీని రిజల్ట్ ఎఫెక్టేగా.. పుష్పను పక్కనబెట్టి.. సరిలేరు నీకెవ్వరు ఓకే చేసింది.
ఇదలా ఉంచితే.. మహేష్ కి ఏమంత మాస్ లుక్ సెట్టవ్వదు. అతడు ఇంటింటి ఆడపిల్లల కలల రాకుమారుడు. ఒకటే స్లాంగ్, ఒకటే వాయిస్, ఒకటే స్టైల్.. ఒకటే.. నటనా శైలి. అయినా సరే సుడి.. వట్రసుడి తిరగటం వల్ల తండ్రి చేసిన సినీ కృషీ పట్టుదల కారణంగా.. ఇతగాడి అదృష్టం ఇంతింతై.. ఇవాళ్టి రోజున ఒక మార్కెట్ ఐకాన్ గా అవతతరించాడు. కానీ, లేకుంటే మహేష్ కి ఉన్న ప్రదర్శనా సామర్ధ్యానికి ఏమంత ఎక్కువ మార్కులు పడవు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని తన ఖలేజాను ఏనాడో గెలిచిన అతడు అంటే త్రివిక్రముడ్ని పెట్టుకుని.. గుంటూరు కారాన్ని దట్టించి మరీ ఓ మాస్ మానియా క్రియేట్ చేయాలని చూస్తున్నాడు మ. మ. మహేష్.. మరి మన మహేష్ బాబు ఆశలు ఆశయాలు నెరవేరేలా ఈ సినిమా ఉంటుందా ?
రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ని బట్టీ చూస్తుంటే.. మాస్ పేరిట ఒకింత ఎక్కువ ఫైట్స్\ సుమోలు లేపడాలు. బీడీలు కాల్చడాలు వంటి వాటితో ఒకరకంగా ఎబ్బెట్టుగా అనిపించిందని చెప్పాలి. ఆల్రెడీ కుర్చీ మడత పెట్టి డైలాగ్ ఇష్యూలో మహేష్ ని అన్నిరకాలుగా మడత పెట్టేశారు నెటిజన్లు. ఈ డైలాగ్ డెలివరీ అయినప్పటి నుంచి చాలానే డిజిటల్ మాధ్యమాలు విరుచుకుపడ్డాయి కూడా. ఇప్పుడు టీజర్ ని చూశాక.. ఇది సంక్రాంతి బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందా? లేక ఒక నిరర్ధక ప్రయత్నంగా మిగిలిపోతుందా? అన్న చర్చకు తెరలేచింది. కొందరు ఫేస్ బుక్కాలజిస్టులు. త్రివిక్రంలో మరెవరో దర్శక శైలి కనిపించిందన్న వ్యాఖ్యానాలు కూడా అగుపించాయ్.
నా వరకు నాకు ఇది మహేష్ త్రివిక్రం ఒరిజినల్ కాంబో కాదు. మాస్ వరకూ ఓకే కానీ ఇప్పుడున్న సలార్ ఎరాలో మాస్ కి అర్ధాలే మారిపోయాయ్. ఇది చాలా చాలా పాత స్టైల్. ఆ మాటకొస్తే సంక్రాంతి పాతే, కోడి పందాలు పాతే.. గుంటూరు కారాలు పాతే. అలాగని- అమ్మని- ఆవకాయనీ సంక్రాంతినీ ఓల్డ్ కింద కొట్టి పడేస్తామా ఏంటి? అదో గోల్డెహె అంటా హిట్టు పీకుతాడా? అని చూస్తే. అందుకు తగ్గ మెటీరియల్ అయితే కనిపించడం లేదు. ఎప్పుడూ ఆ ప్రకాష్ రాజ్ విలనీయేనా? ఏమంత గొప్పగా అనిపించడం లేదు కూడా. దానికి తోడు తన ఎక్స్ ప్రెషన్లు తనకే బోరు కొట్టినట్టు పెడుతున్నాడు. ఆడైలాగ్ డెలివరీ కూడా ఏదో చేయాలి కాబట్టి అన్నట్టుగా ఉంది.
ఆ ఆరార్.. ఆ పిచ్చరైజేషనూ.. అంతా నాన్ కల్ట్ ఏరియాలో కలగలసి పోయేలా ఉన్నాయ్. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ బ్రేకుల్లేని టేకింగ్… తో తీసిన గుంటూరు కారం ఎర్రిపువ్వుగా వీగ్గా కనిపిస్తోంది! మరి చూడాలి.. మన అంచనాలను మించి మన మహేశుడు ఏదైనా ఫెస్టివ్ వండర్ క్రియేట్ చేస్తాడో లేదో.
‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ by సీనియర్ జర్నలిస్ట్ ఆది