Happy Makar Sankranti 2024 Wishes : కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండగ మకర సంక్రాంతి ఈ పండగను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ పండగను రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మకర సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం సంక్రాంతి రోజున పుణ్య నదిలో స్నానం చేసి సూర్య భగవానుడిని పూజించడం వల్ల జీవితంలో కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి అంతేకాకుండా పాపాలు కూడా తొలగిపోతాయని నమ్మకం. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున ప్రతి ఒక్కరు బాగుండాలని ఆ సూర్యభగవానుడికి ప్రార్థిస్తూ మకర సంక్రాంతి ప్రత్యేక శుభాకాంక్షలు. మీరు కూడా మీ స్నేహితులకు, బంధుమిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయండి.
మకర సంక్రాంతి రోజున సూర్యుని రాశి కూడా మారింది..ఇక మీ జీవితాలు కూడా ఇదే రోజు మారి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
పిండి వంటల గుమగుమలు, గంగిరెద్దుల గజ్జల సప్పుడు, సన్నాయి రాగాలు, బసవన్నల ఆటల వేడుకతో మీ జీవితం శుభారంభం కావాలని కోరుకుంటూ.. మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
ఈ మకర సంక్రాంతి సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సూర్య భగవానుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని మనసారా కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
సూర్య భగవానుడి అనుగ్రహంతో మకర సంక్రాంతి సందర్భంగా జీవితంలో ఊహించని లాభాలు పొందాలని కోరుకుంటూ హ్యాపీ పొంగల్. మీ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మకర సంక్రాంతి రోజు ఆ సూర్యభగవానుడిని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.