Crime క్షణకావేశంలో తీసుకొన్న కొన్ని నిర్ణయాలు జీవితాన్ని మార్చేస్తాయి కొన్నిసార్లు జీవితాంతం పశ్చాతాపం పడేలా చేస్తాయి తాజాగా హరిద్వార్లో జరిగిన ఇలాంటి ఓ సంఘటన అందర్నీ కలిసి వేస్తుంది..
హరిద్వార్ లో జరిగిన ఓ సంఘటన అందర్నీ షాక్కు గురిచేస్తుంది హరిద్వార్ బహద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా జంట హత్యలు జరిగాయి.. భార్యాభర్తల మధ్య గత కొన్ని ఏళ్లుగా కొన్ని విషయాలపై విభేదాలు తలెత్తుతూ వచ్చాయి అయితే గొడవలు మరి ఎక్కువ కావడంతో క్షణకావేశంలో భార్య భర్తను గొడ్డలతో హతమార్చింది.. ఈ విషయాన్ని అక్కడే ఉన్న కుమారుడు కళ్ళారా చూశాడు.. తండ్రి మరణాన్ని కళ్ళముందే చూసి తట్టుకోలేకపోయినా కుమారుడు సవతి తల్లి గొంతుకోసి హత్య చేశాడు ఆ తర్వాత ఈ హత్య తానే చేసినట్టు పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
అయితే గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్గుబ్‌పూర్ గ్రామానికి చెందిన ఇనాముల్ హక్, సితార దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. అయితే ఈ గొడవల నుంచి కొన్నాళ్లపాటు విశ్రాంతి కోసం సితార లూత్యానాలో ఒంటరిగా ఉంటుంది ఆమె తిరిగి తన గ్రామానికి వచ్చింది… ఊరికి వచ్చిన తర్వాత సితార సవతి పిల్లలతో గొడవలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆగ్రహనికి గురైన సితార తన భర్త ఇనాముల్ హక్‌ను గొడ్డలితో నరికి చంపింది. తండ్రి హత్య విషయం తెలుసుకున్న కొడుకు తౌహిద్ ఇంటికి చేరుకుని కోపంతో సవతి తల్లిని గొంతు కోసి హత్య చేశాడు.