Health Tips : ప్రస్తుత కాలంలో యువత ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలలో ఒకటి జుట్టు. మగవారిలో ఎక్కువ మండి హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల తక్కువ వయస్సులోనే బట్టతల వచ్చేస్తుంది. ఇక మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయిలకి ప్రధాన ఆకర్షణ అంటే జుట్టు అనే చెప్పాలి. పొడవైన జుట్టు కోసం ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా జుట్టు నల్లగా, ఒత్తుగా ఉండాలని చాలా మంది కోరుకుంటుంటారు. కానీ హార్మోన్ల ప్రభావం, అనారోగ్యాలు వంటివాటితో పాటు మరికొన్ని కారణాలు తోడైతే జుట్టు రాలడం సమస్యగా మారుతుంది. జుట్టు సమస్యలతో బాధపడేవారు ఆందోళన చెందకుండా ఆలివ్ అయిల్ వాడితే పరిష్కారం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…
- ఆలివ్ నూనెలో విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి తలమీద ఉన్న చర్మాన్ని మృదువుగా చేస్తాయి.
- ఆలివ్ ఆయిల్ తో తలపై మర్దన చేయడం వల్ల జుట్టు పొడిబారిపోవడం, తెల్లబడటం, వంటి సమస్యలు తగ్గడంతో పాటు కుదుళ్లు దృఢంగా మారతాయి.
- చుండ్రు కారణంగా పొడిబారిపోయిన జుట్టుకి ఆలివ్‌నూనెతో మర్దన చేయడం వల్ల మంచి పలితం ఉంటుంది.
- కొన్నిసార్లు తలస్నానం చేసిన తర్వాత జుట్టులో మెరుపు కనిపించదు. అలాంటప్పుడు కాచి చల్లార్చిన గ్రీన్ టీని ఆలివ్ నూనెలో కలిపి జుట్టుకి రాసి ఆరనివ్వాలి. తర్వాత గంట సేపు ఆగి తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గి మెరుపు కనిపిస్తుంది.
- జుట్టు బలహీనంగా మారి ఊడిపోతున్నప్పుడు కొబ్బరి పాలల్లో చెంచా ఆలివ్‌నూనె, కాస్త కలబంద గుజ్జు, మూడు గుడ్లలోని తెల్లసొన కలిపి బాగా గిలకొట్టి తలకు పూతలా వేసుకోవాలి. అరగంట తర్వాత గాఢత తక్కువ షాంపుతో తలస్నానం చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
- ఆలివ్ ఆయిల్‌లో వెల్లుల్లి పొట్టును కాల్చిన పొడిని కలిపి తలకు రాసుకుంటే జుట్టు త్వరగా నెరవదు. ఆలివ్ ఆయిల్‌లో కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి, తలకు అప్లై చేయాలి. తర్వాత తలస్నానం చేస్తే జుట్టు మెత్తగా మారుతుంది. వెంట్రుకలు రాలిపోవటాన్ని నివారించవచ్చు.
- ఆలివ్ నూనెని తలకు పట్టించి పదినిమిషాలు మర్దన చేసిన తర్వాత మాడుకి తగిలేలా ఆవిరి పట్టి షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టుకి నిగారింపుగా ఉంటుంది.