Health Tips:
ప్రస్తుత కాలంలో థైరాయిడ్, అధిక బరువు, మధుమేహం వంటి సమస్యలు అధిక స్థాయిలో ఉన్నాయనే చెప్పుకోవాలి. వీటికి ప్రధాన కారణం కాఫీ, టి అధికంగా సేవించడం ద్వారా థైరాయిడ్ మధుమేహం అధిక స్థాయిలో పెరిగిపోతుంది. ప్రస్తుత కాలంలో టీ, కాఫీ సేవించని వారు ఎవరు ఉండరని చెప్పుకోవాలి. అయితే అధిక స్థాయిలో చక్కెర, కాఫీ పొడి, టీ పొడి, పాలు ఉండడం ద్వారా ఇవి మధుమేహం, అధిక బరువు అధికమయ్యేలా తోడ్పడతాయి. అలానే టీ, కాఫీ పొడిలో కెఫిన్ అనే పదార్థం అధిక మోతాదులో ఉంటుంది. ఇవి అధికంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటి అన్నిటికన్నా అడవి చామంతిను టీ రూపంలో సేవించడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకోండి.
సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యం పై ప్రస్తుత కాలంలో దృష్టి పెడుతున్నారు. పానీయాల దగ్గర నుండి ఆహారం వరకు చాలా జాగ్రత్తలు వహిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో అధిక బరువు శాతం అధికంగా ఉంది. మన భారతదేశంలోని కొన్ని కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు అని కొన్ని అధ్యయనాల్లో స్పష్టంగా తెలిసిందే. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గ్రీన్ టీ లెమన్ టీ అంటూ వివిధ రకాల టీలను సేవిస్తున్నారు. అయితే అడవి చామంతుల ద్వారా కూడా టీ సేవించవచ్చు. దీనివల్ల అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చామంతి టీ లో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా లభిస్తుంది ఇది థైరాయిడ్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
అలానే ఒత్తిడి,టెన్షన్ వంటివి మటుమాయం అవుతాయట ఈ పానీయాన్ని సేవించడం ద్వారా రీఫ్రెష్ గా కుడా ఫీలవుతారు. మరి ముఖ్యంగా అధిక బరువుతో బాధపడుతున్న వారికి మంచి ఫలితం దక్కుతుంది. అలానే మలబద్దకం సమస్యను దూరం చేసుకోవచ్చు అని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.