Health Tips: వర్షాకాలంలో సహజ సిద్ధమైన పుట్టగొడుగులు అధికంగా దొరుకుతాయి. మనం ఎప్పుడు తీసుకునే పుట్టగొడుగులు మానవుడి చేత సృష్టింపబడినవే మన ఆహారంలో తీసుకుంటా. అయితే సహజంగా గ్రామీణ ప్రాంతాలు దొరికే పుట్టగొడుగుల్లో ఎటువంటి రసాయనాలు లేకుండా ప్రకృతి ప్రసాదించిన ఆహారంలో ఒకటిగా చెప్పుకోవచ్చు. అయితే ఇవి తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యంలో చెడు కొలెస్ట్రాలను తగ్గించుకోవచ్చు అలానే క్యాన్సర్ బారిన పడకుండా పుట్టగొడుగులు ఎంతగానో తోడ్పడతాయి. మారుతున్న కాలనుసారంగా ప్రకృతి ప్రసాదించే పుట్టగొడుగులు అతి తక్కువగానే జరుగుతున్నాయని చెప్పుకోవాలి. అందుచేత మార్కెట్లో దొరికే పుట్టగొడుగులను తీసుకోవడం జరుగుతుంది.
మార్కెట్ లో దొరికే పుట్టగొడుగులకి గ్రామీణ ప్రాంతాల్లో దొరికే పుట్టగొడుగు లో పోషక విలువల మధ్య వ్యత్యాసం అధికంగా ఉంటుంది. పుట్టగొడుగులు ఆహార పోషక విలువ తెలిసినవారు మార్కెట్లో దొరికే వాటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. పుట్టగొడుగులో విటమిన్-బి1, బి2, బి9, బి12, విటమిన్-సి, విటమిన్-డి2 ఉంటాయి. పుట్టగొడుగులు పిండి పదార్థాలు అధికంగా లభిస్తాయి కొవ్వుల శాతం సున్నాగా ఉంటుంది. అయితే పుట్టగొడుగులు తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యంలో ఎన్ని రోగాలను మటుమాయం చేసుకోవచ్చు తెలుసుకోండి మరి.
గుండెపోటు సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో పుట్టగొడుగులను చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పుట్టగొడుగుల్లో కొవ్వు పరిమాణం సున్నాగా ఉంటుందని అది గుండెకి రక్తాన్ని సరఫరా చేయడంలో ఎంతగానో తోడ్పడుతుందని తెలుపుతున్నారు.అయితే పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యలు ఏర్పడవు. మరి ముఖ్యంగా ఊబకాయ సమస్యతో బాధపడేవారు పుట్టగొడుగులను అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయ సమస్య నుంచి విముక్తి పొందే అవకాశం అధికంగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇవి కేవలం పుట్టగొడుగులలో ఉండే ప్రయోజనాలు పై అవగాహన కల్పించడం మాత్రమే. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు.