Health Tips : మనం తినే ఆహారం మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుందని అందరికీ తెలిసిన విషయమే. అందుకే మనం ఆరోగ్యంగా ఉండడానికి తీసుకునే ఆహారం పట్ల ఎన్నో జాగ్రతలు వహిస్తూ ఉంటాం. అయితే భోజనానికి ముందు, భోజనం చేసిన తరువాత కొన్ని పనులు చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మనం తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. భోజనానికి ముందు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా…
రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేసిన వెంటనే కొంతమంది నిద్ర పోతారు. ఇలా చేయటం వల్ల మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడంతో నిద్ర సరిగ్గా పట్టదని అంటున్నారు. నిద్రకు ముందు రాత్రి భోజనానికి మధ్య కనీసం 3 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
అలాగే కొంతమంది భోజనం చేసిన వెంటనే టీ తాగుతారు. ఇలా టీ తాగడం వల్ల తేయాకులో ఉండే రసాయనాలు మనం తీసుకునే ఆహార పదార్థాలను విచ్ఛిన్నం కానివ్వకపోవడంతో… జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయనిన్ చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే టీ, కాఫీలను తగకుండా కనీసం 30 నిమిషాలు అయినా ఆగాలని అంటున్నారు.
భోజనం చేసిన వెంటనే కొందరికి వాకింగ్ చేయడం అలవాటు. తిన్న కొంత సమయం తరువాత వాకింగ్ చేయడం వల్ల మనం తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుందని… అరగంట తర్వాతే వాకింగ్ చేయాలని సిఫార్సు చేస్తున్నారు.
ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయడం కూడా ప్రమాదమేనట. అది మన శరీర ఉష్ణోగ్రతను అమాంతం పెంచుతుందట. ఈ క్రమంలో మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే పనిలో ఉండే జీర్ణక్రియకు ఆటంకం కలిగించినట్టే అవుతుంది. దీంతో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.