Health Tips : కొబ్బరి నూనె జుట్టును బలంగా చేయడానికి, పెరగడానికి సహాయపడుతుందని అందరికి తెలుసు. అయితే చాలా రాష్ట్రాల్లో మాత్రం కొబ్బరి నూనెను సౌందర్యానికి వాడతారు. కొబ్బరి నూనెలోని అద్భుతమైన పోషకాలు ఆరోగ్యానికి, సౌందర్యానికి ఉపయోగపడతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలికి కొబ్బరి నూనె అద్భుతమైనదిగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలానే చలికాలంలో చర్మ పగుళ్లు ఏర్పడకుండా ఉండేందుకు కొబ్బరి నూనె చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో వంటల్లోనూ కొబ్బరి నూనెను ఎక్కువగా వాడుతున్నారు. కొబ్బరి నూనెతో ఉండే బెనిఫిట్స్ ఏంటో ప్రత్యేకంగా మీకోసం…
కొవ్వు కరిగిస్తుంది : కొబ్బరి నూనెలో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ల వల్ల ఒంట్లోని కొవ్వు క్రమంగా కరుగుతుంది. కొబ్బరి నూనెలోని కొవ్వులు 65% ఎంసిటి కాబట్టి, ఇది స్వచ్ఛమైన ఎంసిటి నూనె లాగా ఉండే కొవ్వును కాల్చే లక్షణాలను కలిగి ఉంటుంది.
జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది : చాలా మంది సౌందర్య సాధనంగా కొబ్బరి నూనెను వాడతారు. జుట్టుకు, చర్మానికి ఈ ఆయిల్ ను అప్లై చేసుకుంటారు. కొబ్బరి నూనె పొడి చర్మం యొక్క తేమను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది చర్మం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌లను తరచుగా ఉపయోగించడం వల్ల ఏర్పడే పొడి చర్మాన్ని నిరోధించడానికి 6-8 చుక్కల కొబ్బరి నూనెను మీ చేతులకు పూయడం మరియు రాత్రిపూట వదిలివేయడం ఒక ప్రభావవంతమైన మార్గం అని ఇటీవలి అధ్యయనం నిర్ధారించింది.
నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది : కొబ్బరి నూనెను నోటిలో పోసుకుని పుక్కిలించడాన్ని ఆయిల్ పుల్లింగ్ అంటారు. ఇలా ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను గణనీయంగా తగ్గుతుంది. కొబ్బరి నూనెలోని లారిక్ యాసిడ్ లాలాజలంతో చర్య జరిపి సబ్బు లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఇది కావిటీస్‌ను నిరోధిస్తుంది. దంత క్షయాన్ని, చిగుళ్ల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.