Natural Eyebrows : చూడగానే ఒక మనిషిని ఎట్రాక్ట్ చేసేవి కళ్ళు ఇంక కనుబొమ్మలు. ఆ కనుబొమ్మలు అందంగా, నల్లగా ఉంటే ముఖం మరింత అందంగా ఉంటుంది. కానీ, కొంతమందికి చిన్నతనంలోనే జుట్టు నెరసిపోతుంది. అలానే కనుబొమ్మలు కూడా నెరసిపోతాయి. అలాంటి సమస్యకి కొన్ని టిప్స్ పాటిస్తే జుట్టు నల్లగా ఒత్తుగా ఉండేసరికి,కళ్ళు అంధం గాను ,మొహం నీట్‌గా కనిపిస్తుంది.
కొందరికీ వయసు పెరిగే కొధి జుట్టు తెల్లబడుతుంది. అలానే కనుబొమ్మలు కూడా తెల్లగా మారతాయి. కనుబొమ్మలు తెల్లగా మారడానికి పోషకాహార లోపం ముఖ్య కారణం. జుట్టు రంగు మారడం, వృద్ధాప్యం, హార్మోన్ల సమస్యలు, ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కూడా కనుబొమ్మల్ని తెల్లగా మారేలా చేస్తాయి.
కనుబొమ్మలు తెల్లగా ఉంటే వాటిని నల్లగా మార్చేందుకు కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్‌ని వాడతారు. కానీ, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలాంటి సమస్య లేకుండా ఇంటి చిట్కాలు నల్లని కనుబొమ్మల్ని మీకందిస్తాయి.
కనుబొమ్మలు తెల్లగా మారడానికి కారణం ఏంటి అంటే పోషకాహార లోపం .మెలనిన్ అనేది మన జుట్టు, కనుబొమ్మల వెంట్రుకలు నల్లగా ఉండేందుకు సాయపడుతుంది. మెలనిన్ లోపం వల్ల కనుబొమ్మలు తెల్లగా మారేలా చేస్తాయి.
కనుబొమ్మలు నల్లగానే కాదు ,ఒత్తుగా ఉంచుతుంది అప్పుడు ఇంకా అంధం గా కనిపిస్తాయి. ఇలా చేస్తే కనుబొమ్మలు నల్లగా మారుతాయి.
జుట్టుకి సహజమైన రంగుని ఇవ్వడానికి కాఫీ హెల్ప్ అవుతుంది. కాబట్టి, కాఫీ పొడిని కనుబొమ్మలు నల్లగా చేసేందుకు హెల్ప్ చేస్తుంది.కాఫీ పొడి ని నీటి లో కలిపి కనుబొమ్మలికి రాస్తే చాలు తేడా వెంటనే చూడవచ్చు . కనుబొమ్మల రంగు మారుతుంది .