health drinks :సమ్మర్ అంటే ఎవ్వరికైనా సరే చల్ల చల్ల గా తాగాలి అనిపిస్తుంది . హెల్త్ కాపాడుకోవడానికి అలాగే ఈ సమ్మర్ సీజన్ కి సూట్ అయ్యే డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయుర్వేదం ఆరోగ్యకరమైన జీవితానికి మంచి మార్గాన్ని చూపిస్తుంది. ప్రజెంట్ సమ్మర్ కొనసాగుతోంది. ఎండలు పెరగడం వల్ల డీహైడ్రేషన్ అవుతోంది. ఈ టైమ్‌లో మంచి డ్రింక్స్ తాగాలి. ఈ టైమ్‌లో హైడ్రేట్‌గా ఉంచేందుకు ఆయుర్వేదం మంచి మూలికా డ్రింక్స్, పండ్లు, కూరగాయల రసాల్ని సూచిస్తోంది.
మజ్జిగ..
మజ్జిగకి ఆయుర్వేదలో మంచి స్థానం ఉంది. ఇందుకోసం పెరుగుని మజ్జిగలా చేయండి. అందులో వేయించిన జీలకర్ర పొడి వేయాలి. అవసరమైతే అల్లం ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేయండి. అంతే మంచి డీహైడ్రేషన్ డ్రింక్ రెడీ అయినట్లే.ఈ డ్రింక్ వంటిలోని వేడిని తగ్గిస్తుంది .
దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. రోజంతా హైడ్రేట్‌గా ఉంచేందుకు హెల్ప్ అవుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు దీనిని తాగొచ్చు.
ఉసిరి రసం..
కావాల్సిన పదార్థాలు..
ఉసిరికాయలు – 3
నిమ్మరసం 3 టేబుల్ స్పూన్లు
తేనె -రుచికి సరిపడా
ఉప్పు -చిటికెడు..
ఉసిరికాయల్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. అందులో నిమ్మరసం, తేనె, ఉప్పు వేసి కలిపి తాగండి.
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎండాకాలంలో మంచి చలువ చేసినట్లుగా ఉంటుంది. దీనిలోని శీతలీకరణ గుణాలు పిత్త దోషాన్ని దూరం చేస్తుంది.ఈ డ్రింక్స్ వంటిలోని వేడిని తగ్గిస్తాయి . ఈ సమ్మర్ లో ఎక్కువగా తీసుకోవాల్సిన డ్రింక్స్ ఇవే …