Health మహమ్మారి కరోనా తీవ్రంగా ఉన్న రోజుల్లో అందరూ ఇంట్లోనే ఉండిపోయారు. ఆ సమయంలో అందరూ వచ్చినా, రాకపోయినా ఇంట్లోనే వేరువేరు వంటకాలు తయారు చేసుకుంటూ కాలం గడిపేశారు. ఏది తిన్నా… ఎలా తిన్నా ఆ సమయంలోనే ఆరోగ్యంగా ఉన్నామంటారు చాలా మంది. కానీ… ఇప్పుడు ఉద్యోగ, వ్యాపార ఒత్తిళ్లల్లో వీలుకావడం లేదంటూ… చెబుతుంటారు. అలాంటి వాళ్ల కోసం సులువుగా అయిపోయే, అదిరిపోయే వంటకమే… గ్రీన్ స్మూతీ రెసిపీ… రెగ్యూలర్‌గా ఈ అల్పాహారాన్ని ఉదయం తీసుకుంటే… మీ అందం రెట్టింపు అవుతుంది అంటా. ఈ విషయం చెప్పింది ఎవరో తెలుసా… అమెరికన్ యాక్టర్ అండ్ ప్రోడ్యూసర్.. రీస్ విథర్స్పూన్. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పంచుకున్న ఈ వంటకం తయారీ మీరు తెలుసుకోండి. ఈ వంటకం చేసేందుకు కావల్సిన పదార్థాలు… 2 హెడ్స్ రొమైన్ పాలకూర, అరకప్పు బచ్చలి కూర, కప్పు కొబ్బరి నీరు, ఒక అరటి పండు, ఒక ఆపిల్, ఒక పియర్, ఒక నిమ్మకాయ, కొద్దిగా సెలెరీ, ఆల్మండ్ బటర్…. చివరి రెండూ ఎవరి అభిరుచికి తగ్గట్లు వారి వాడుకోవచ్చు.
తయారీ విధానం..
పాలకూరను ముక్కలుగా కత్తిరించి కడిగి వడకట్టాలి. ఆపిల్, పియర్స్, నిమ్మకాయ తొక్కు తీసి ముక్కలుగా కత్తిరించాలి. తర్వాత బచ్చలికూర, కొబ్బరి నీరు, అరటి పండు, ఆపిల్, పియర్, నిమ్మకాయ, ఇతర పదార్థాలను బ్లెండర్లో వేయాలి. అన్ని పదార్థాలను కలిపి జ్యూస్‌లా మొత్తగా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఓ గ్లాసులో కొన్ని ఐస్ క్యూబ్స్…. గ్రీన్ స్మూతీలో వేయండి. కావాలనుకుంటే ఇందులో కొద్దిగా సెలరీ, ఆల్మండ్ బటర్ని కలుపుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది.