Viral Video రోడ్డుమీద వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అదుపుతప్పిన పెను ప్రమాదాలు జరుగుతాయి. అయితే ఎంతటి ప్రమాదమైన కొందరు అదృష్టవశాత్తు బతుకుతారు.. అందులో హెల్మెట్ ధరిస్తే ఇంకొంత సాయం అవుతుంది.. తాజాగా జరిగిన ఇలాంటి ఓ సంఘటనే ప్రస్తుతం వైరల్ గా మారింది..
బైక్ మీద రాష్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తికి కారు అడ్డంగా రావడంతో ఈ కారును తప్పించబోయి పక్కనే ఫుట్ పాత్ మీద ఉన్న స్తంభాన్ని గట్టిగా ఢీకొంటాడు. ఈ ప్రమాదంలో అదుపుతప్పి కింద పడ్డ వ్యక్తి పైకి లేచేలోగా ఆ స్తంభం అతని తలని గట్టిగా ఢీకొంటుంది.. అయితే ఆ సమయంలో ఆ వ్యక్తి హెల్మెట్ ధరించి ఉండటం వల్ల పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. లేదంటే ప్రాణానికే ప్రమాదం అయ్యేది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రమాదాలు ఎటువైపు నుంచి వస్తాయో తెలియదు అందుకే చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం..
ఈ వీడియోను ఢిల్లీ పోలీసులు తమ అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.. అంతే కాకుండా హెల్మెట్ పెట్టుకుంటే దేవుడు హెల్ప్ చేయగలుగుతాడు అంటూ ట్యాగ్ కూడా చేశారు.. ప్రతి సంవత్సరం ఎన్నో వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. నిత్యం పోలీసుల సైతం హెల్మెట్ ధరించండి అని చెప్తూనే ఉంటారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగినప్పుడు తలకు హెల్మెట్ ఉంటే కొంతైనా రక్షణగా ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోకూడదు.
God helps those who wear helmet !#RoadSafety#DelhiPoliceCares pic.twitter.com/H2BiF21DDD
— Delhi Police (@DelhiPolice) September 15, 2022