Hero Dhanush, Tamil Blockbuster Jagame Thandhiram Movie Songs, Karthik Subbaraj, James Cosmo, Aishwarya Lekshmi, Netflix Movies, Film News,
FILM NEWS: హీరో ధనుష్ “జగమే తంతిరం” పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన.
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరు ఎంతో ఆసక్తిగా ‘జగమే తంతిరం’ సినిమాను వీక్షించేందుకు ఎదురు చూస్తున్నారు. ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘జగమే తంతిరం’. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 18న ప్రసారం కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ముంచి స్పందన లభిస్తుంది. అలాగే సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ సినిమా కంప్లీట్ మ్యూజిక్ ఆల్భమ్‌ను సోనీ మ్యూజిక్ సంస్థ మార్కెట్‌లోకి తీసుకురానుంది.
ట్రైలర్ కంటే ముందే విడుదలైన ‘రకిట రకిట’, ‘బుజ్జి’, మరియు ఇటీవల విడుదలైన రొమాంటిక్ సాంగ్ ‘నేతూ’ శ్రోతల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఈ పాట రిధమ్, బీట్స్ శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. ‘రికట రకిట’ సాంగ్‌కు లిరిక్స్ అందించడంతో పాటుగా ఈ పాటను ధనుష్ పాడారు. ఈ సినిమాకు సంతోష్ నాయరణన్ అందించిన సంగీతం సూపర్భ్ అనే చెప్పాలి. ‘జగమే తంతిరం’ సినిమా నుంచి మూడు పాటలకే వస్తేనే ఊగిపోయిన శ్రోతలు…ఇప్పుడు ఈ సినిమా ఎంటైర్ ఆల్భమ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణం రానే వచ్చింది. ప్రముఖ సోనీ మ్యూజిక్ సంస్థ ప్రేక్షకుల ముందకు తీసుకు వస్తున్న ‘జగమే తంతిరం’ ఈ జ్యూక్ బ్యాక్స్‌లో 8 పాటలు ఉన్నాయి. ఈ ఎనిమిది పాటలు వేటికవే ప్రత్యేకంగా ఉండబోతుండటం విశేషం. సో…‘జగమే తంతిరం’ పాటలను లూప్‌లో పెట్టుకుని సంగీతాన్ని ఆస్వాందించేందుకు ప్రేక్షకులు రెడీ అయిపోండి. సురలి (జగమే తంతిరం’ చిత్రంలోని ధనుష్ పాత్ర)కు విజిల్స్, చప్పట్లతో గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పండి.
‘జగమే తంతిరం’ మ్యూజిక్ ఆల్భమ్ లాంచ్ సందర్భంగా సోనీ మ్యూజిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రజత్ కక్కర్ మాట్లాడుతూ – “జగమేతంతిరం’ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ‘రకిట రకిట’, ‘బుజ్జి’, ‘నేతూ’ పాటలకు శ్రోతల నుంచిమంచి స్పందన లభిస్తుంది. అలాగే ఈ సినిమా కంప్లీట్ ఆల్భమ్ శ్రోతలను మరింత ఊర్రూతలూగిస్తుందని నమ్ముతున్నాం. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘జగమేతంతిరం’ వంటి ప్రాజెక్ట్‌తో అసోసియేట్ అయినందుకు సంతోషంగా ఉంది. ధనుష్, కార్తీక్ సుబ్బరాజు, సంతోష్ నారాయణన్ వంటి ప్రతిభావంతులు కలిసి చేసిన ఈ సినిమా మాకు ఎంతో స్పెషల్. ఓ మ్యాజికల్ ప్రాజెక్ట్. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఏపీ ఇంటర్‌నేషనల్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రముఖ సంస్థలతో అసోసియేషన్ మాకు ఎప్పుడూ సంతోషకరమే. భవిష్యత్‌లో కూడా వారితో కలిసి మరిన్ని ప్రాజెక్ట్స్ చేయటం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.
ఈ సినిమాకు సంగీతం అందించిన సంతోష్ నారాయణన్ మాట్లాడుతూ – ‘‘జగమేతంతిరం’ సినిమాలోని పాటల కోసం మ్యూజిక్ స్టూడియోలో ఎంతో టైమ్ స్పెండ్ చేశాం. ఈ ఆల్భమ్‌లోని ప్రతి సాంగ్ కొత్తగా ఉండేలా ప్రయత్నించి సఫలమైయ్యాం. నాకు అవసరమనిపించిన ప్రతి చోట ఓ సరికొత్త సంగీతాన్ని అందించాను. ఈ సినిమాకు సంగీతం సమకూర్చడాన్ని ఎంతగానో ఆస్వాదించాను. రకిట పాట విడుదలైనప్పుడు ఈ పాట మనలోని ఒత్తిడిని తగ్గించేలా స్ట్రెస్ బస్టర్‌గా బాగా ఉందని చెబుతుంటే హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు సోనీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ‘జగమేతంతిరం’ లోని మొత్తం పాటలను విడుదల చేయనుంది. రకిట పాటకు దక్కిన స్పందనే ఈ సినిమాలోని అన్ని పాటలకు దక్కుతుందని నమ్ముతున్నాను’’ అని అన్నారు.
తెలుగు ఆల్భమ్:
రకిట రకిట (అనంతు, సుష, సంతోష్ నారాయణన్, భాస్కరభట్ల)
బుజ్జి (సంతోష్ నారాయణన్, భాస్కరభట్ల)
నీతో (విజయ్ నరైన్, భాస్కరభట్ల)
రేలా రేలా (ఆంథోనీ దాసన్, భాస్కరభట్ల)
వేట వేట వేట (సంతోష్ నారాయణన్, భాస్కరభట్ల)
వెళ్తున్నారా (సవిత సాయి,భాస్కరభట్ల)
నూరేళ్లు నిండిపోయాయా(సన్నిధానందన్, భాస్కరభట్ల)
నాతోటి రేస్–యు (ఓఫ్రో, సంతోష్ నారాయణన్,భాస్కరభట్ల)తారాగణం:
ధనుష్, జేమ్స్ కాస్మో, ఐశ్వర్యా లక్ష్మీ, జోసెఫ్ జోజు జార్జ్, కలైయారసన్, శరత్ రవి, రోమన్ ఫియోరీ, సుందరరాజ, దురై రామచంద్రన్, మాస్టర్ అశ్వత్
సాంకేతిక నిపుణులు:
రచయిత–దర్శకుడు: కార్తిక్ సుబ్బరాజ్
సంగీతం: సంతోష్ శివన్
డీఓపీ: శ్రేయాస్ కృష్ణ
ఎడిటర్: వివేక్ హర్షన్