Entertainment అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హిట్ 2 ది సెకండ్ కేస్’.. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 2 న విడుదలైన మంచి హిట్ టాక్ సంపాదించుకుంది.. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర బృందం.. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన నాని ఈ సందర్భంగా పలు విషయాలను పంచుకున్నారు..
ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్త కథలను కోరుకుంటూ ఉంటారు… భిన్నంగా సినిమాలు కావాలని నిరూపిస్తూ ఉంటారు… కమర్షియల్ తో పాటు కంటెంట్ కూడా ముఖ్యమే అంటూ ఆడియన్స్ సినిమాలను వైవిధ్యంగా కోరుకుంటున్నారు ఇదేవిధంగా దర్శక నిర్మాతలు కూడా అభిమానులకు తగ్గట్టు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు… అలాంటి వైవిధ్యమైన కథాంశంతో రీసెంట్ టైమ్‌లో వచ్చిన సినిమా ‘హిట్ 2 ది సెకండ్ కేస్’.. అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శైలేష్ దర్శకత్వం వహించారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్.
ఈ సినిమా సక్సెస్ తర్వాత సినిమా గురించి మాట్లాడారు హీరో నాని. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాణంలో చిత్రీకరణలో తన జర్నీ కోసం వివరించిన నాని.. ‘‘వాల్ పోస్టర్ సినిమా పెట్టి అందులో కొత్త ఐడియాలతో కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలని అనుకున్నాను. రెగ్యులర్ సినిమాలు చేయకూడదనే ఈ బ్యానర్ స్టార్ట్ చేశాను. డిఫరెంట్ సినిమాలను చేస్తే చూడరు కదా. వర్కవుట్ అవుతుందా.. అని చాలా మంది భయపెట్టారు. కానీ నాకు ఎక్కడో బలమైన నమ్మకం. తెలుగు ప్రేక్షకులు డిఫరెంట్ సినిమాలను చూస్తారనే ధైర్యం ఉండింది. అది మరోసారి హిట్ 3తో ప్రూవ్ అయ్యింది’’ అన్నారు. సినిమా విడుదలై మంచి హిట్ అవుతుంది సంపాదించుకోవడమే కాకుండా వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతుంది..