కొందరు సినీ ప్రముఖులు ఓ వైపు షూటింగుల్లో పాల్గొంటూనే మరోవైపు తమకు నచ్చిన వ్యాపారాలు చేస్తుంటారు. తెలుగులో ఇప్పటికే రామ్‌చరణ్ ‘ట్రూజెట్’ విమానయాన సంస్థలో పార్టనర్‌గా ఉన్నారు. మహేశ్‌బాబు ఇప్పటికే మల్టీప్లెక్స్ రంగంలో ఉండగా.. అల్లు అర్జున్ కూడా అదే ఫీల్డ్‌లో వ్యాపారాలకు మొగ్గు చూపుతున్నారు.
తాజాగా యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కూడా వ్యాపారంలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారట. ఆయన మంచి భోజన ప్రియుడు కావడంతో రెస్టారెంట్లు, హోటళ్ల బిజినెస్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.