Prabhas : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన దీపికా పదుకొనే(Deepika Padukone) వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా బిజీగా ఉంది. గతంలో పలు హాలీవుడ్(Hollywood) సినిమాల్లో కూడా మెరిపించింది. ఇక ఇప్పుడు దీపికా ప్రభాస్ సరసన కల్కి 2898 AD సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ని హాలీవుడ్ కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రకటించారు. ఈ ఈవెంట్ కి ప్రభాస్, కమల్ హాసన్, చిత్రయూనిట్ హాజరయ్యారు కానీ దీపికా రాలేదు.
తాజాగా ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ప్రభాస్ కల్కి 2898 AD సినిమా గురించి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో దీపికా పదుకొనే గురించి మాట్లాడాడు.
ప్రభాస్ మాట్లాడుతూ.. దీపికా చాలా పెద్ద సూపర్ స్టార్. చాలా అందమైన అమ్మాయి, ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా తన సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇంటెర్నేషనల్ బ్రాండ్స్ కి యాడ్స్ చేసింది, అంబాసిడర్ గా కూడా ఉంది. సెట్ కి దీపికా వచ్చినప్పుడు అందరికి ఉత్సాహం వస్తుంది. నేను తనతో ఎప్పట్నుంచో వర్క్ చేయాలనుకున్నాను. అయితే ఇప్పటికీ ఆ అవకాశం వచ్చింది . దీనికి నాకు ఎంతో సంతోషం గా వుంది .ఆమెతో ఇదే మొదటిసారి వర్క్ చేస్తున్నాను. ఆమెని నటిగా చాలా ఇష్టపడతాను. ఆమె నటనకు నేను ఒక ఫ్యాన్ అని తెలిపాడు. దీంతో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. దీపికా అభిమానులు ప్రభాస్ వ్యాఖ్యలని మరింత వైరల్ చేస్తున్నారు.