Entertainment తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా దాదాపు 15 ఏళ్ల క్రితం వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న ఈ భామ అప్పటినుంచి వరస అవకాశాలను అందుపుచ్చుకుంటూ వస్తుంది అయితే ఒకరకంగా స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న ఈమె తాజాగా గుర్తుందా శీతాకాలం చిత్రంలో నటించింది ఈ సినిమాలో హీరోగా సత్యదే నటించాడు అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యదేవ్ తమన్నా అంత పెద్ద హీరోయిన్ అయి ఉండి నా పక్కన నటించటానికి ఒప్పుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు..
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సత్యదేవ్ “ఈ ఏడాదిలో నా నుంచి వస్తున్న ఐదో చిత్రమిది. చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి అన్నయ్య ముందే చెప్పినట్లుగా గాడ్‌ఫాదర్ చిత్రంతో ద్వారా నేను మరింత మందికి చేరువయ్యా. ఇలాంటి తరుణంలో గుర్తుందా శీతాకాలం లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది. నేనిందులో దేవ్ అనే పాత్రలో కనిపిస్తా. అతని జీవితంలోని నాలుగు ప్రేమకథల్ని ఈ చిత్రంలో చూపించనున్నాం. ఇలాంటి సినిమా నేనిప్పటి వరకు చేయలేదు. తమన్నా పాత్ర ప్రవేశించాక ఈ చిత్ర స్వరూపమే మారిపోతుంది.. అయితే తమన్నా ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు.. తమన్నా అంత పెద్ద హీరోయిన్ అయి ఉండి నా పక్కన నటించటానికి ఒప్పుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు.. నా పక్కన హీరోయిన్గా చేయడానికి తను ఒప్పుకుంటుందని తెలిసి షాక్ అయ్యాను..” అంటూ చెప్పుకొచ్చారు…