Hero Tanish Movie Maro Prasthanam, Heroine Muskan Sethi, Director Johny, Bhanu Sri Mehra, Latest Telugu Movies, Telugu World Now,
Tollywood News: రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే.. అదే తనీష్ “మరో ప్రస్థానం” సినిమా స్పెషాలిటీ.
ఇప్పుడు ట్రెండ్ మారింది. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు ఆదరణ బాగా పెరిగింది. ఇది తనీష్ హీరోగా నటించిన “మరో ప్రస్థానం” సినిమాకి ఓ వరం అని చెప్పచ్చు. తనీష్, ముస్కాన్ సేథీ జంటగా నటించిన ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ మూవీని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ఈ నెలాఖరుకు “మరో ప్రస్థానం” చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
“మరో ప్రస్థానం” సినిమా విషయానికి వస్తే…రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. సినిమాలో కథ ఎంత టైమ్ లో జరిగితే, సరిగ్గా అదే టైమ్ కు సినిమా కంప్లీట్ అవుతుంది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో ఎలాంటి కట్స్, జర్క్స్, రివైండ్ షాట్స్ లేకుండా స్ట్రైట్ స్క్రీన్ ప్లే తో “మరో ప్రస్థానం” చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు జాని. ఇలా రెగ్యులర్ గా వచ్చే సినిమాలకు పూర్తి భిన్నంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓ ఎమోషనల్ కిల్లర్ జర్నీ అని చెప్పచ్చు. కథ, కథనం సరికొత్తగా ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులు తర్వాత సీన్ లో ఏం జరుగుతుందో అని ఉత్కంఠతో చూసేలా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను డైరెక్టర్ జాని తెరకెక్కించారట.. సినిమా సక్సస్ పై టీమ్ మెంబర్స్ అందరూ గట్టి నమ్మకంతో ఉన్నారు. దీనికి కారణం… ఇటీవల కాలంలో వచ్చిన కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు ఆదరణ లభించడమే అని చెప్పచ్చు.
వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. అతి త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి మాటలు – వసంత కిరణ్, యానాల శివ, పాటలు – ప్రణవం.., సంగీతం – సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ – ఎంఎన్ బాల్ రెడ్డి, ఎడిటర్ – క్రాంతి (ఆర్కే), ఎస్ఎఫ్ఎక్స్ – జి. పురుషోత్తమ్ రాజు, కొరియోగ్రఫీ – కపిల్, ఫైట్స్ – శివ, దర్శకత్వం – జాని.