Entertainment పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టినా కొందరు హీరోయిన్ల అందం ఏ మాత్రం తగ్గదు. 40 ఏళ్లకు చేరువవుతున్న ఎంతో అందంగా మెరిసిపోతూ ఉంటారు. ఇలాంటి వారిలో ముందుంటారు హోమ్లీ బ్యూటీ స్నేహ. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లతో మెస్మరైజ్ చేస్తూ వస్తున్న స్నేహ తాజాగా పంచుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
అభినయంతో, అందంతో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న బ్యూటీ స్నేహ. దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా వెలుగొందారు. అందరి హీరోల పక్కన పని చేసి మంచి స్టేటస్ను అందుకున్నారు. 2001లో విడుదలైన ప్రియమైన నీకు చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన స్నేహ.. లవ్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ మూవీలకు క్యారఫ్ అడ్రస్ గా మారిపోయారు..
2012లో నటుడు ప్రసన్నను స్నేహ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2011లో తమ ప్రేమ గురించి మీడియాకు వెల్లడించిన ప్రసన్న-స్నేహ పెళ్లితో ఒక్కటయ్యారు.
అయితే స్నేహకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు
పిల్లలు పుట్టే వరకు గ్యాప్ తీసుకున్న స్నేహ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేశారు. ఇప్పుడు వదిన అక్క పాత్రలో నటిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో సన్నాఫ్ సత్యనారాయణ వినయ్ విధేయ రామలో మంచి పాత్ర పోషించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలదొక్కుకున్నారు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్నేహ తనకు సంబంధించిన ఫోటోలు అన్నీ పంచుకుంటూ వస్తుంటారు. ముఖ్యంగా తన కుటుంబానికి సంబంధించిన పిల్లలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసుకుంటూ వస్తున్న స్నేహ లేటెస్ట్ ఫోటో షూట్లతో సైతం ఆకట్టుకుంటున్నారు ప్రస్తుతం పంచుకున్న ఫోటోలు గ్రీన్ కలర్ డ్రెస్ లో స్నేహ అందం వర్ణనతీతం అని చెప్పాలి..