Entertainment టాలీవుడ్ హీరో రవితేజ శ్రీ లీల జంటగా నటించిన చిత్రం ధమాకా త్రినాధ రావు దర్శకత్వంలో తరికెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది అయితే ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా థియేటర్లో కాసేపు టికెట్లు అమ్మి హడావిడి చేసింది హీరోయిన్ శ్రీ లీల..
రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ధమాకా చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది అయితే ఈ ట్రైలర్ చూసిన ఆయన అభిమానులంతా ఈ సినిమా పక్కా మాస్ మూవీ అని తేలిపోయింది అలాగే రవితేజకు ఎప్పుడు కలిసి వచ్చే కామెడీ కూడా ఈ సినిమాలో బాగానే ఉండనట్టు తెలుస్తోంది అయితే గత కొంతకాలంగా హిట్లర్ లేని రవితేజ ధమాకాపై చాలా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా డిసెంబర్ 23న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా గడుపుతుంది సినీ బృందం అలాగే హీరోయిన్ శ్రీల బిగ్ బాస్ హౌస్ లోకి కూడా వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది అయితే తాజాగా ఈ హీరోయిన్ గచ్చిబౌలిలో ఉన్న ఏషియన్ మహేష్ బాబు మాల్లో కాసేపు సందడి చేసింది అక్కడికి వచ్చిన యువతతో కలిసి డాన్స్ చేసిన ఈ భామ టికెట్ కౌంటర్లోకి వెళ్లి ధమాకా అడ్వాన్స్ బుకింగ్ టికెట్లను అమ్మింది.. హీరోయిన్ డైరెక్ట్ గా టికెట్లు అమ్మడంతో చాలామంది టికెట్లు కొనడానికి ఎగబడ్డారు.. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాలో శ్రీ లీల నటించిన సంగతి తెలిసిందే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కాగల లేకపోయినా శ్రీలీలకు మాత్రం మంచిగానే అవకాశాలు తెచ్చిపెట్టింది.. అలానే నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న NBK108 మూవీలో శ్రీలీల ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది