అందాల కథానాయిక పూర్ణ, అర్జున్ అంబటి, రాకేందు మౌళి ప్రధాన పాత్రదారులుగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కళ్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ రిజ్వాన్ నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నంబర్-3 చిత్రం “సుందరి”. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని “ఓ కలనే కంటూవుంటే’ పాట మ్యూజిక్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. యువ సంగీత కెరటం సురేష్ బొబ్బిలి అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేశారు. కాగా “సుందరి” ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఫిబ్రవరి 3న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది..
ఈ కార్యక్రమంలో…హీరోయిన్ పూర్ణ, హీరో అర్జున్ అంబటి, దర్శకుడు కళ్యాణ్ జి. గోగణ, నిర్మాత రిజ్వాన్, ఎడిటర్ మణికాంత్, లైన్ ప్రొడ్యూసర్ శ్రీ వలీ చైతన్య, కో-ప్రొడ్యూసర్ ఖుషీ పాల్గొన్నారు.. మీడియా సమక్షంలో సుందరి ట్రైలర్ విడుదలైంది.
పూర్ణ, అర్జున్ అంబటి, రాకేందు మౌళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్; మదన్ మోహన్ రెడ్డి, పీఆర్ఓ; వంశీ-శేఖర్, పాటలు; రాకేందు మౌళి, ఎడిటర్; మణికాంత్, కెమెరామెన్; యం యన్. బాల్ రెడ్డి, మ్యూజిక్; సురేష్ బొబ్బిలి, లైన్ ప్రొడ్యూసర్; శ్రీ వల్లీ చైతన్య, కో- ప్రొడ్యూసర్; ఖుషీ, కె. రామిరెడ్డి, నిర్మాత; రిజ్వాన్, రచన-దర్శకత్వం; కళ్యాణ్ జి. గోగణ.