Hidden Facts about Psycho Leaders, Special Story on Psycho Leaders,Most Famous Psychos,
■ సైకో లక్షణాలు ఉన్న వారు మంచి నాయకులా?
■కార్పొరేట్ ప్రపంచంలోని కొందరు వ్యక్తులకు సాధారణంగానే సైకో లక్షణాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నవి.ప్రతి అయిదుగురు కంపెనీ బోర్డు డైరెక్టర్లు, సీనియర్ మేనేజర్లలో ఒకరు తమలోని సైకో లక్షణాలను దాచిపెట్టి ఇతరులను ఆకర్షించేలా ప్రవర్తిస్తున్నట్లు పరిశోధనలు వివరిస్తున్నవి.అమెరికాలోని బిజినెస్ లీడర్లలో 4 శాతం మందికి సైకో లక్షణాలు ఉండొచ్చని న్యూయార్క్‌కు చెందిన మానసిక వైద్యుడు పాల్ బబాయిక్ తన పరిశోధనలో వెల్లడించారు.”ఒక ఉద్యోగానికి సరైన నైపుణ్యాలు ఎంత అవసరమో, వ్యక్తిత్వం కూడా అంతే అవసరం. కొన్ని ఉద్యోగాల్లో మంచి ఫలితాలు సాధించాలంటే సైకో లక్షణాలు అవసరమవుతాయి” అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మానసిక శాస్త్ర నిపుణులు డాక్టర్ కెవిన్ డట్టన్ అభిప్రాయపడ్డారు.అలాగే రాజకీయ నాయకుల్లోనూ ‘సైకో’ లక్షణాలు ఉన్న వాళ్ళు త్వరగా క్లిక్ అవుతారని పరిశోధనలు చెబుతున్నవి.
■ ‘సైకో లీడర్ల’కు సాధారణంగా ఉండే లక్షణాలు:
1. భయం లేకపోవడం.
2. ముందువెనుకా ఆలోచించకుండా తోచింది చెయ్యడం.
3. పశ్చాత్తాపం లేకపోవడం.
4. తమ అవసరాల కోసం ఇతరులను వాడుకోవడం.
5. పరమ స్వార్థం.
6. కఠినంగా ఉండటం.
*అయితే ఈ లక్షణాల వల్ల కొంత మంచీ, కొంత చెడూ రెండూ ఉంటని డాక్టర్ కెవిన్ డట్టన్ అన్నారు. సందర్భానికి తగినట్లుగా వ్యక్తిత్వాన్ని మలుచుకోవాల్సి ఉంటుందని సూచించారు.”కఠినంగా వ్యవహరించడం తప్పు కాదు. అయితే సందర్భం ముఖ్యం. భయపడకుండా ముందడుగు వేయడం మంచిదే కానీ అది ఒక్కోసారి నిర్లక్ష్యానికి దారితీయొచ్చు” అని తెలిపారు.”ఆయా సందర్భాలకు తగినట్లుగా వ్యక్తిత్వాన్ని మలుచుకోవడమే అసలైన విజయ రహస్యం” అని డట్టన్ పేర్కొన్నారు.