సహస్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిశాంత్, ఎంఎన్ఓపీ సమర్పణలో.. నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి, దర్శకుడు బసిరెడ్డి రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం హైడ్ న్ సిక్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. హీరో నటుడు శివాజీ చేతుల మీదుగా ఈ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మూవీ కాస్ట్ అండ్ క్రూ తో పాటు ముఖ్య అతిధులు పాల్గొని మాట్లాడారు.
నటుడు హీరో శివాజీ మాట్లాడుతూ.. ముందుగా హైడ్ న్ సిక్ టీం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా డైరెక్టర్ బసిరెడ్డి రానా #90 సినిమా చేస్తున్నప్పటి నుంచి తెలుసని, మంచి వ్యక్తిత్వంతో పాటు, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన వర్క్ చాలా డైనమిక్ గా ఉంటుందని అన్నారు. డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెరకెక్కించిన #90 చిత్రంలో తాను కరాటే మాస్టర్ గా ఒక చిన్న రోల్ చేశాడని, ఆరోజే సెట్ లో తన వర్క్ స్టైల్ చూశానని శివాజీ చెప్పారు. హైడ్ న్ సిక్ చిత్రంతో తెలుగు పరిశ్రమలు మరో ఫెంటాస్టిక్ డైరెక్టర్ పరిచయం అవుతున్నాడని బలంగా నమ్మున్ననని అన్నారు.
ప్రొడ్యూసర్ కేవలం స్క్రిప్టును, డైరెక్టర్ బసిరెడ్డి రానాను నమ్మి డబ్బులు పెట్టారు అంటే.. మనం అర్థం చేసుకోవచ్చు డైరెక్టర్ డైనమిక్ ఏంటని అని యాక్టర్ శివాజీ వెల్లడించారు. నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి కి మంచి విజయం చేకూరుతుందని తెలిపారు. అలాగే హీరో హీరోయిన్లు ఇద్దరికీ అభినందనలు చెప్పారు. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ఈమధ్య ఎక్కువగా వస్తుంది అని, ఇది చాలా మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఒకప్పటిలా కాదు ఇప్పుడు అవకాశం అందుకోవడం చాలా సులభతరం అయిందని.. మంచి కంటెంట్ ఉంటే చాలు ఇండస్ట్రీలో నిలబడొచ్చని నటుడు శివాజీ పేర్కొన్నారు.
చిత్రం : హైడ్ న్ సిక్
నటీనటులు : విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్దేవ్, శ్రీధర్ తదితరులు
దర్శకత్వం : బసిరెడ్డి రానా
నిర్మాత : నరేంద్ర బుచ్చిరెడ్డిగారి
బ్యానర్ : సహస్ర ఎంటర్ టైన్మెంట్స్
సమర్పణ : ఎంఎన్ఓపీ
సంగీత దర్శకుడు : లిజో కె జోష్
సినిమాటోగ్రాఫర్ : చిన్న రామ్
ఎడిటర్ : అమర్ రెడ్డి కుడుముల
లిరిసిస్ట్ : సుద్దాల అశోక్ తేజ
ఆర్ట్ : నిఖిల్ హస్సన్
పీఆర్ఓ : హరీష్, దినేష్
పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్