Health ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్య తలనొప్పి. మనం తరచూ వింటూనే ఉన్నా ఈ సమస్యని తగ్గించుకునే పరిష్కారాలు మాత్రం వెతకం. మారిపోతున్న జీవన శైలి ముఖ్యంగా కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు వర్క్ చేసే వాళ్ళు.. సాప్ట్ వేర్ వాళ్ళలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే తలనొప్పిని అదుపులో ఉంచుకోవచ్చు..
ఈ కాలంలో ప్రతి ఒక్కరిని వేధించే సమస్య తలనొప్పి. ఈ సమస్యను దూరం చేసుకోవాలి అంటే కచ్చితంగా మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా నీరు ఎక్కువగా తీసుకునే వాళ్ళలో తలనొప్పి సమస్య వేధించడం తగ్గుతుంది.. రోజు కచ్చితంగా 6 నుంచి 10 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. అంతేకాకుండా వీలున్నప్పుడల్లా తలకు కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవాలి. దీనివలన తలనొప్పి బాధ తగ్గి రిలాక్స్ దొరుకుతుంది. అంతేకాకుండా లావెండర్ ఆయిల్ పీల్చడం వల్ల తలనొప్పి నుంచి తాత్కాలిక ఉపశమనం దొరుకుతుంది.. అలాగే ఎక్కువసేపు కంప్యూటర్ను చూడాల్సి వచ్చినప్పుడు కాస్త సమయం గ్యాప్ తీసుకుని కళ్ళను ముని వేళ్ళతో మర్దన చేసుకోవాలి. అదే సమయంలో కనుబొమ్మలపైన వేళ్ళతో సున్నితంగా మర్ధన చేయడం వల్ల తలనొప్పి సమస్య తగ్గుతుంది. యోగాను రోజు దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల తలనొప్పి సమస్య దూరం అవుతుంది.. రోజు వీలైనంత సమయం యోగాకు కేటాయించాలి.. వేటితో పాటు కచ్చితంగా రోజు ఎనిమిది గంటల నిద్ర అవసరం నిద్ర లేకపోతే తలనొప్పి సమస్య మరింతగా వేధిస్తుంది..