వైవిధ్యమైన కంటెంట్‌ను పలు భాషల్లో అందిస్తూ తనదైన మార్క్ క్రియేట్ చేసి దూసుకెళ్తోన్న డిజిటల్ మాధ్యమం జీ 5 త్వరలోనే ‘మాయాబజార్ ఫర్ సేల్’ అనే సరికొత్త మల్టీస్టారర్ తెలుగు వెబ్ ఒరిజినల్‌ను అందించనుంది. వివిధ కథ, కథనాల ద్వారా సెటైరికల్ డ్రామాగా రూపొందుతోన్న ‘మాయాబజార్ ఫర్ సేల్’ వెబ్ సిరీస్ గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతోంది.
జీ 5తో పాటు రానా దగ్గుబాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా బ్యానర్ కలిసి సునిశితమైన, హృద్యమైన డ్రామాగా మాయాబజార్ ఫర్ సేల్‌ను రూపొందిస్తున్నారు. ఇదొక గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. గౌతమి చిల్లగుల్ల దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ జూలై 14 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ కార్యక్రమంలో ..నవదీప్ మాట్లాడుతూ.. “గతంలో పల్లెటూర్లలోని ప్రజలు అందరూ ఒక కుటుంబంలాగా ఉండేవాళ్లు. సాయంత్రమైతే ఓ ఇంటి వద్ద అందరూ కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్లు. అలాంటి ఎమోషన్స్‌ను డైరెక్టర్ గారు చక్కగా చూపించారు. రకరకాల మనుషులు ఉన్నారు. ఒకరికి పిల్లి నచ్చదు. ఒకరికి కుక్క నచ్చదు. అన్ని పాత్రలను డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎప్పుడో రామానాయుడు గారు మొదలు పెట్టిన ఒక అఖండ దీపాన్ని ముందుకు తీసుకువెళుతూ.. యంగ్ టీమ్‌ను, కొత్త ప్రొడక్ట్స్‌ను స్క్రీన్‌పై తీసుకువస్తున్న మా రానాకు ఆల్ ద బెస్ట్. మాయాబజార్‌లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.