Telugu World Now
No Result
View All Result
Wednesday, July 2, 2025
  • Login
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
Telugu World Now
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result
Home Entertainment

‘వాల్తేరువీరయ్య’లోకలర్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు బ్యూటీఫుల్ఎమోషన్స్ వుంటాయి : దర్శకుడు బాబీ కొల్లి

I Was Lucky To Do a Film With Chiranjeevi and Ravi Teja. 'Waltheru Veeraiya' Has Colorful Entertainment, Director Bobby Kolli interview

Sowmya by Sowmya
January 8, 2023
in Entertainment

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని  మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్‌ తో పాటు .. ఇద్దరూ కలసి అలరించిన పూనకాలు లోడింగ్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అల్బమ్‌లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.  ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదలౌతున్న నేపధ్యంలో దర్శకుడు బాబీ కొల్లి విలేఖరుల సమావేశంలో ‘వాల్తేరు వీరయ్య’  విశేషాలని పంచుకున్నారు.

సంక్రాంతికి భారీ పోటీ వుంది కదా.. ఒత్తిడి అనిపిస్తుందా ?

అదేంలేదండీ. వేరే నిర్మాతలు అయితే ఒత్తిడి ఉండొచ్చేమో..ఒకే నిర్మాతలు కాబట్టి రెండు ఫలితాలు బావుండాలని పాజిటివ్ గా ఎదురుచుస్తున్నాం.

‘వాల్తేరు వీరయ్య’ బ్యాక్ స్టొరీ చెప్పండి ?

‘వాల్తేరు వీరయ్య బ్యాక్ స్టొరీ చెప్పాలంటే ముందు నా బ్యాక్ స్టొరీ చెప్పాలి. చిరంజీవి గారికి ఒక ఫ్యాన్ బాయ్ గా 2003 నా జర్నీ మొదలైయింది. చిరంజీవి గారి సినిమాలో పని చేయాలనే ఒక కల వుండేది. ఇప్పుడు 2023లో మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేసిన సినిమా విడుదలౌతుంది. నా జీవితంలో మర్చిపోలేని స్పెషల్ మూమెంట్ ఇది.

స్వయంకృషి తో ఎదిగిన చిరంజీవి గారు, రవితేజ గారు లాంటి స్టార్స్ తో వర్క్ చేయడం ఎంత కిక్ ఇచ్చింది ?

చిరంజీవి గారు, రవితేజ గారు ఎలా అయితే ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చారో నేను కూడా ఏ సపోర్ట్ లేకుండా వచ్చాను. వాళ్ళిద్దరితో సినిమా చేయడం నా అదృష్టం. మాస్ ఆడియన్స్ ఏం కావాలో అనే దానిపై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టి డిజైన్ చేయడం జరిగింది.

Mega Star Chiranjeevi, Mass Maharaja Ravi Teja, Bobby Kolli, Mythri Movie Makers Waltair Veerayya Title Song Out,Telugu Golden TV,My Mix Entertainments,telugu world news,www.teluguworldnow.comచిరంజీవి గారి సినిమా అనేసరికి ఖచ్చితంగా హిట్టు కొట్టాలనే ఒత్తిడి ఉందా ?

లేదండీ. మెగాస్టార్ గారు ఎన్నో విజయాలు బ్లాక్ బస్టర్లు అలాగే కొన్ని అపజయాలు కూడా చూసుంటారు. ఆయనకి ఉన్నంత బ్యాలెన్స్ ఎవరికీ ఉండదని కూడా చెప్పొచ్చు. అలాగే రవితేజ గారు కూడా అంతే. ఒక సినిమాకి చేయాల్సిన న్యాయం కష్టం సర్వస్వం పెడతారు. ఫలితం మాత్రం ప్రేక్షకుల చేతిలో ఉంటుందని బలంగా నమ్ముతారు.

‘వాల్తేరు వీరయ్య’ కోసం అందరూ ఫ్యాన్స్ లా పని చేశాం అని చెప్పారు.. ఇలా ఫ్యాన్ సెంట్రిక్ అవడం వలన రెగ్యులర్ ఆడియన్స్ ని మర్చిపొతున్నామనే భావన కలుగుతుంది కదా ?

నిజానికి ఈ కథ లాక్ డౌన్ కి ముందు ఒక ఫ్యాన్ బాయ్ గానే చెప్పాను. అయితే లాక్ డౌన్ లో పరిస్థితులు మారిపోయాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఓటీటీకీ అలవాటు పడ్డారు. డిఫరెంట్ కంటెంట్ కి అలవాటు పడ్డారు.  ఈ క్రమంలో అందరినీ అలరించే కథ చెప్పాలని ప్రత్యేక ద్రుష్టి పెట్టాం. దాంట్లో నుండి వచ్చిన క్యారెక్టరే రవితేజ గారిది. ఒక ఫ్యాన్ బాయ్ గా మొదలుపెట్టి ఒక డైరెక్టర్ గా ఇద్దరి పాత్రలని బ్యాలెన్స్ డిజైన్ చేశాను. ఇందులో చివరి వరకూ కథే గొప్పగా కనిపిస్తుంది. బీసి సెంటర్ ఆడియన్స్ తో పాటు మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులని కూడా అలరించే అన్ని గుణాలు లక్షణాలు వాల్తేరు వీరయ్యలో కనిపిస్తాయి.

చిరంజీవి గారు, రవితేజ గారి కాంబినేషన్ ఎలా వుండబోతుంది ? వాల్తేరు వీరయ్య కథ ఏమిటి ?

ప్రతి సీన్ లో ఎంటర్ టైన్ మెంట్ వుంటుంది. అలాగే అద్భుతమైన ఎమోషన్ వుంటాయి. పండక్కి రాబోతున్న కలర్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు బ్యూటీఫుల్ ఎమోషన్స్ వున్న చిత్రం వాల్తేరు వీరయ్య.

Mega Star Chiranjeevi, Mass Maharaja Ravi Teja, Bobby Kolli, Mythri Movie Makers Waltair Veerayya Fourth Song Poonakaalu Loading On December 30th,Telugu Golden TV,My Mix Et,www.teluguworldnow.comవాల్తేరు వీరయ్య టైటిల్ పెట్టడానికి కారణం.. ?

‘వెంకీ మామ’ షూటింగ్ యాగంటిలో జరుగుతున్నపుడు నాజర్ గారు ఒక పుస్తకం ఇచ్చారు. అందులో వీరయ్య అనే పేరు ఆకట్టుకుంది. ఈ టైటిల్ తో సినిమా చేయాలని అప్పుడే మా టీంకి చెప్పాను. అలాగే చిరంజీవి గారు ఇండస్ట్రీకి రాకముందు బాపట్ల లో వున్నప్పుడు చిరంజీవి గారి నాన్నగారు దగ్గర పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ఐదు వందలు ఇచ్చి ఫోటో షూట్ చేయించారు. ఆ ఫోటోల  వలనే మద్రాస్ వచ్చానని చిరంజీవి గారు చెప్పారు. ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్య. ఇది చాలా నోస్టాలిజిక్ గా అనిపించింది. ఇందులో చిరంజీవి పాత్రకు వీరయ్య పేరు అయితే బావుంటుందని అనిపించింది. ఇది చిరంజీవి గారికి కూడా నచ్చింది. అలా వాల్తేరు వీరయ్యని లాక్ చేశాం.

వాల్తేరు వీరయ్యలో రవితేజ గారిది క్యామియో రోల్ నా ?

అది ఇప్పుడు చెప్పను.  మీరు 13వ తేదిన చూడాలి. రవితేజ లేకుండా వాల్తేరు వీరయ్య సినిమాలేదని మాత్రం చెప్పగలను.

మీరు గోపీచంద్ మలినేని గారు కలసి పని చేశారు కదా.. ఇప్పుడు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఎలా అనిపిస్తుంది ?

నేను రైటర్ గా గోపి డైరెక్టర్ గా చాలా కాలం జర్నీ చేశాం.  మేమిద్దరం బ్రో అని పిలుచుకుంటాం. ఒకే బ్యానర్ లో ఇప్పుడు రెండు సినిమాలతో రావడం చాలా అనందంగా వుంది.  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో కలిశాం. ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నాం. ఇద్దరి సినిమాకు ప్రేక్షకులని బలంగా ఆకట్టుకుంటాయని నమ్మకంగా వున్నాం.

Mega Star Chiranjeevi, Mass Maharaja Ravi Teja, Bobby Kolli, Mythri Movie Makers Waltair Veerayya Title Song On December 26th,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.comరవితేజ గారి చాయిస్ ఎవరిది ?

రవితేజ గారి చాయిస్ నాదే. రవితేజ గారిని తీసుకోవాలనే ఆలోచన రావడం, చిరంజీవి గారికి చెప్పడం, ఆయన మరో ఆలోచన లేకుండా ఓకే అనడం, చిరంజీవి గారిపై వున్న ప్రేమ అభిమానం, నాపై వున్న నమ్మకంతో రవితేజ గారు ఒప్పుకోవడం జరిగింది.

ఇందులో ముఠామేస్త్రీ గ్యాంగ్ లీడర్ లాంటి వింటేజ్ లుక్ కనిపిస్తోంది. కథ అనుకున్నపుడే ఇలా డిజైన్ చేశారా ?

వాల్తేరు వీరయ్య పాత్రలో ఆ లిబర్టీ వుంది. ఆయన లుంగీ కట్టుకోవచ్చు, బీడీ తాగొచ్చు, రౌడీ అల్లుడు స్వాగ్ ఉండొచ్చు . గ్యాంగ్ లీడర్ లా  గన్ పట్టుకొని వార్ కి రావచ్చు. ఆ ఫ్రీడమ్ అంతా వీరయ్య క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది తప్పితే బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయలేదు.

వాల్తేరు వీరయ్యలో కామెడీ గురించి చెప్పండి ?

చిరంజీవి గారి  డ్యాన్స్ తో పాటు ఫన్ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఫన్ టైమింగ్ లో ఆయన మాస్టర్ . మనం ఫన్ ఇవ్వగలిగితే దాన్ని స్కై లెవల్ కి తీసుకెళ్ళిపోతారాయన. ఆ మ్యాజిక్ అంతా చూస్తూ పెరిగాను. ఈ ఎనర్జీ అంతా ఆయన నుండి తీసుకోవడం జరిగింది.

పూనకాలు లోడింగ్  గురించి చెప్పండి ?

ఇప్పుడు ప్రతి సినిమాకి హ్యాష్ టాగ్ లు పెడుతున్నారు. కొత్త గా వుండాలి మాస్ కి తెలిసుండాలి అలాంటి టాగ్ గురించి ఆలోచిస్తున్నపుడు  పూనకాలు లోడింగ్ అనే టాగ్ అయితే బావుంటుందని అనుకున్నాం.  ఈ టాగ్ ని అందరూ రిఫరెన్స్ గా తీసుకోవాలని అనుకున్నాం., మేము అనుకున్నట్లే ఇప్పుడు అందరూ లోడింగ్ అనే మాటని పాజిటివ్ వైబ్ గా వాడుతున్నారు. ఈ విషయంలో మేము సక్సెస్ అయినట్లే.

Chiranjeevi, Shruti Haasan Waltair Veerayya Second Single 'Nuvvu Sridevi Nenu Chiranjeevi' Releasing on December 19th,Telugu Golden TV,www.teluguworldnow.comఇద్దరు హీరోలని బ్యాలెన్స్ చేస్తున్నపుడు అభిమానుల విషయంలో ఒత్తిడి వుంటుందా ?

వాల్తేరు వీరయ్యలో నాకున్న సౌలభ్యం ఏమిటంటే చిరంజీవి గారి ఫ్యాన్స్, రవితేజ గారి ఫ్యాన్స్ ఒకటే. చిరంజీవి గారిని అభిమానించే ఫ్యాన్స్ రవితేజ గారిని కూడా ఎంతగానో అభిమానిస్తారు. ఆలాగే చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎదిగానని రవితేజ గారు ఎన్నో సార్లు చెప్పారు. ఈ విషయంలో చిరంజీవి గారు కూడా ఎంతో ఆనందంగా వుంటారు. ఫ్యాన్స్ అందరూ ఇద్దరి నీ ఒకేలా ప్రేమిస్తారని మా నమ్మకం. పూనకాలు లోడింగ్ సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ దీనికి నిదర్శనం.

వాల్తేరు వీరయ్య ఫస్ట్ కాపీ మీరు చూశారు.. ఎలా అనిపించింది ?

నేను చూడటం కంటే 153 సినిమాలు చేసిన చిరంజీవి గారు నేను చేసిన సినిమా చూస్తున్నారంటే నాకు రెండు రాత్రుల నిద్రలేదు. ఆయన జడ్జ్మెంట్ చాలా పక్కాగా వుంటుంది. వాల్తేరు వీరయ్య మొత్తం చూసి ‘’వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం బాబీ’’  అన్నారు. ఆ రోజు నేను గర్వంగా ఫీలయ్యాను. ఆయన నన్ను ఓ తమ్ముడిగా దగ్గరకు తీసుకున్న ఆత్మీయత నా జీవితంలో మర్చిపోలేను. చిరంజీవి గారి లాంటి మాస్ మూలవిరాట్ నన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకోవడం సర్రియల్ మూమెంట్. ఆ ఫోటోని ఫ్రేమ్  కట్టించుకున్నా.

దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ గురించి ?

చిరంజీవి గారిది దేవిశ్రీ ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వాల్తేరు వీరయ్య ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా థియేటర్ కి వచ్చే ముందు మొదట గెలిచేది ఆడియో పరంగా. అలా మమ్మల్ని గెలిపించిన దేవిశ్రీ ప్రసాద్ గారి కి మా టీం అందరి తరపున కృతజ్ఞతలు.

Theater Standees With Mega Star Chiranjeevi's Massiest From Waltair Veerayya Unveiled,Bobby Kolli KS Ravindra,Shruti Haasan,Telugu Golden TV,My Mix Entertainments,telugu world news,www.teluguworldnow.comఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారి గురించి ?

ఏఎస్ ప్రకాష్ గారు ఒక సీనియర్ ఆర్ట్ డైరెక్టర్. ఆయనకి మనం ఏ ఇన్ పుట్స్ ఇవ్వడానికి పెద్ద హోం వర్క్ అవసరం లేదు. కథ చెప్పినప్పుడే వరల్డ్ మొత్తాన్ని అర్ధం చేసుకుంటారు. బాస్ పార్టీ సాంగ్ ఒక జాలరీ పేట షిప్పియార్డ్ కల్చర్ లో వుండాలి. ఆయన అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారు.

మైత్రీ మూవీ మేకర్స్ గురించి ?

మైత్రీ మూవీ మేకర్స్ తో కలసి పని చేయాలని ఎప్పటినుండో వుండేది. ఇలాంటి సమయంలో నవీన్ గారు సినిమా చేద్దామని అడిగారు. తర్వాత జర్నీ మొదలైయింది. అద్భుతమైన నిర్మాతలు. సినిమా అంటే ప్యాషన్. సినిమాకి ఏం కావాలో ఎక్కడ రాజీ పడకుండా సమకూరుస్తారు.

‘వాల్తేరు వీరయ్య’కి సీక్వెల్ ఉంటుందా ?

ఇప్పటికైతే లేదండీ. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు కోరిక బట్టి ఆ దిశగా ఆలోచిస్తాం.

Party Song Of The Year- Boss Party From Megastar Chiranjeevi, Urvashi Rautela, Bobby Kolli, Mythri Movie Makers’ Waltair Veerayya Unveiled,Ravi Teja, Shruti Haasan,www.teluguworldnow.comవాల్తేరు వీరయ్య హిందీ రిలీజ్ గురించి చెప్పండి ?

చిరంజీవి గారికి , రవితేజ గారికి హిందీలో మంచి మార్కెట్ వుంది. ఈ ఇద్దరు హీరోలు అక్కడి ఆడియన్స్ కి చాలా ఇష్టం. వాల్తేరు వీరయ్య తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి విడుదల చేస్తున్నారు నిర్మాతలు.

పాన్ ఇండియా సినిమాలు చేసే ఆలోచన ఉందా ?

పాన్ ఇండియా రాజమౌళి గారు మనికి ఇచ్చిన అద్భుతమైన ఫ్లాట్ ఫామ్. అలాంటి కథ దొరికితే నేను కూడా చేయాలని అనుకుంటాను.

ఆల్ ది బెస్ట్

థాంక్స్

Source: I Was Lucky To Do a Film With Chiranjeevi and Ravi Teja. 'Waltheru Veeraiya' Has Colorful Entertainment, Director Bobby Kolli interview
Via: I Was Lucky To Do a Film With Chiranjeevi and Ravi Teja. 'Waltheru Veeraiya' Has Colorful Entertainment, Director Bobby Kolli interview

Related Posts

Heroine Dhanya Balakrishna makes a splash in Vindhya Gold Silver Bar Challenge, Sarath City Mall (AMB Mall, Kondapur), Entertainment News, Telugu World Now
Entertainment

Vindhya Gold Silver Bar Challenge : వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో హీరోయిన్ ధ‌న్య బాల‌కృష్ణ‌ సందడి

May 26, 2025
Hero Shivaji & Heroine AnanyaNagalla Launched Gismat jail mandi new branch @gowlidoddy,Bombay Bhole Music Director Bhole Shavali,Gouthami Chowdhary,Best Restaurants in Hyderabad, Telugu World Now
Entertainment

Gismat Jail Mandi Gowlidoddy : గౌలిదొడ్డిలో ‘జిస్మత్ జైలు మండి’ 15వ బ్రాంచ్ గ్రాండ్ లాంచ్

May 18, 2025
Samyuktha Menon Inaugurates Neelambhhari Silks 1st Store in A.S. Rao Nagar, Handloom saris, Handwoven Saris, Pattu saris, weavers, Telugu World Now
Latest News

Neelambhhari Silks : చేనేత చీరలంటే తనకెంతో ఇష్టమన్న నటి సంయుక్తా మీనన్‌

April 19, 2025
aha original webseries Hometown clocks over 100 million streaming minutes, Medaram Naveen Official Productions (MNOP), Director Srikanth Reddy, Rajeev Kanakala, Jhansi, Telugu World Now
Entertainment

Hometown Web Series : ఆహా ఓటీటీలో 100 మిలియన్ ఫ్లస్ మినిట్స్ వ్యూయర్ షిప్ సాధించిన ‘హోం టౌన్’ వెబ్ సిరీస్

April 14, 2025
Arjun Son Of Vyjayanthi movie, pre-release & trailer launch event. Young Tiger NTR, Nandamuri Kalyan Ram, Vijayashanthi, Director Pradeep Chilukuri, Film News
Film News

Arjun S/O Vyjayanthi : విజయశాంతి గారు మాట్లాడుతుంటే ఈ ఈవెంట్ లో నాన్నగారు లేని లోటు భర్తీ అయినట్లు అనిపించింది : యంగ్ టైగర్ ఎన్టీఆర్

April 13, 2025
aha launches Pocket Pack offer, Latest Telugu News, Telugu World Now
Entertainment

Latest Telugu news : నెలకు కేవలం 67 రూపాయల ‘పాకెట్ ప్యాక్’ ఆఫర్ అనౌన్స్ చేసిన ఆహా ఓటీటీ

March 31, 2025
Entertainment

టైటిల్‌ కు తగ్గట్టు పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పించింది

May 13, 2024
Entertainment

మెగాస్టార్  చిరంజీవి, మాస్  మహారాజా రవితేజల విశ్వరూపం వాల్తేరు వీరయ్య : దర్శకుడు బాబీ కొల్లి

May 13, 2024
Entertainment

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్ లు పవర్ ఫుల్ గా వుంటాయి : రామ్ లక్ష్మణ్ మాస్టర్స్

May 13, 2024
Entertainment

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ #NBK108 మొదటి షెడ్యూల్‌ పూర్తి

May 13, 2024
IOS app IOS app IOS app
ADVERTISEMENT
Google News Google News Google News
ADVERTISEMENT
Follow WhatsApp Channel Follow WhatsApp Channel Follow WhatsApp Channel
ADVERTISEMENT
Pakka Real Estate Pakka Real Estate Pakka Real Estate
ADVERTISEMENT
Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram
ADVERTISEMENT
Google Play Store Google Play Store Google Play Store
ADVERTISEMENT

Recent News

IAS officer Divya Devarajan assures free treatment for head injuries after car tire burst in Saudi Arabia, Ptavasi Prajavani, CM Revanth Reddy, Saudi News, Telugu World Now

Saudi Arabia News : సౌదీలో కారు టైరు పేలి తలకు గాయాలు

July 1, 2025
Journalists pay tribute to freedom, condolence meeting at JCHSL office, The Journalists Cooperative Housing Society Managing Committee, Allam Narayana, Telugu World Now

స్వేచ్ఛ కు జర్నలిస్టుల ఘన నివాళి – JCHSL కార్యాలయం లో సంతాప సభ

July 1, 2025
Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

July 1, 2025
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

June 27, 2025
Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

June 27, 2025
Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

June 26, 2025
మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

June 26, 2025
నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

June 26, 2025
“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

June 25, 2025
Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్

Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్

June 25, 2025
Latest Film News :  హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్

Latest Film News : హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్

June 25, 2025
హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

June 24, 2025
రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

June 24, 2025
Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

June 24, 2025
‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

June 24, 2025
Advertisement Advertisement Advertisement
ADVERTISEMENT

Recent News

IAS officer Divya Devarajan assures free treatment for head injuries after car tire burst in Saudi Arabia, Ptavasi Prajavani, CM Revanth Reddy, Saudi News, Telugu World Now

Saudi Arabia News : సౌదీలో కారు టైరు పేలి తలకు గాయాలు

July 1, 2025
Journalists pay tribute to freedom, condolence meeting at JCHSL office, The Journalists Cooperative Housing Society Managing Committee, Allam Narayana, Telugu World Now

స్వేచ్ఛ కు జర్నలిస్టుల ఘన నివాళి – JCHSL కార్యాలయం లో సంతాప సభ

July 1, 2025
Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

July 1, 2025
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

June 27, 2025

Categories

  • Andhra Pradesh
  • Andhra Pradesh
  • Arts
  • Bhakthi
  • CRIME – Police News
  • Editors
  • Entertainment
  • Film News
  • Health
  • Journalist Audi
  • Latest News
  • Movie Reviews
  • National
  • Politics
  • Sports
  • Telangana
  • Uncategorized

Quick Links

  • Home
  • Contact Us
  • Privacy & Policy

Google News – Telugu World Now

 

Telugu World Now

మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు.

అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.

.. ఎడిటర్

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

WhatsApp us