Health నేటి రోజుల్లో మనకు దొరికిన అద్భుత ఔషధం కలబంద దేశ విదేశాల్లో ఉన్నవారు భారతదేశానికి వచ్చి కలబంద విశేషాలు తెలుసుకొని వాళ్ళ దేశంలో ఇప్పుడు లక్షల హెక్టార్ లో పండిస్తున్నారు. ఎన్నో అద్భుత ఔషధ గుణాలున్న కలబందను ఉపయోగించి ఎన్నో రకాల వ్యాధులకు మందులను కనుక్కుంటున్నారు. అలాంటి కలబందను మనం సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నాం. అయితే ఆరోగ్యానికి అందానికి కలబంద ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు.
ముఖ్యంగా అందం విషయంలో కలబందకు పెద్ద పీట వేయవచ్చు.. సహజ సిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన కలబంద చర్మం పై వచ్చే ఎన్నో రకాల సమస్యలను నివారిస్తుంది రోజు కలబందను మొహానికి రాసుకోవడం వల్ల మొహం ఎంతో కాంతవంతంగా మారుతుంది నల్లని మచ్చలను తగ్గించడంలో కలబంద ముందుంటుంది అలాగే వయసు పెరుగుతున్న కొలది వచ్చే ముడతలు నివారించడంలో కలబంద ఎంతో ఉపయోగపడుతుంది దీన్ని నేరుగానే రాసుకోవచ్చు అలాగే డాండ్రఫ్ సమస్యలతో బాధపడేవారు జుట్టు పొడిబారి ఇబ్బంది పెడుతుంటే తలకు కలబందని రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కలబంద సహజ కండిషనర్ గా పనిచేస్తుంది.
రోజు పరగడుపునే కలబంద జ్యూస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది పొట్ట మొత్తం క్లీన్ అవుతుంది అలాగే శరీరంలో ఉండే షుగర్ లెవెల్ అని కూడా తగ్గిస్తుంది స్త్రీ సంబంధిత సమస్యలను తగ్గించడంలో కలబంద జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలాంటి రసాయనాలు లేని ఈ కలబందను మన నిత్యజీవితంలో భాగం చేసుకుంటే ఎన్నో అద్భుత ఫలితాలను పొందవచ్చు


























