Entertainment మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్.. మలయాళం లో ఈ సినిమాను పృథ్వీరాజ్, సుకుమారన్ సిజ్జు కలిసి నటించారు అదే సినిమాను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా తో సాగర్ కే చంద్ర తీశారు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది అయితే ఈ చిత్రానికి గాను మొదటగా పవన్ కళ్యాణ్ను అనుకోలేదంట అయితే మరి ఎవరిని అనుకున్నారో చూద్దాం..
ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన భీమ్లా నాయక్ చిత్రం పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్లో వచ్చి మంచి హిట్ అందుకుంది ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించగా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు.. అయితే ఈ చిత్రానికి నిర్మాతగా సూర్యదేవర నాగావంశీ వ్యవహరించారు ఈయన తాజాగా ఆహాలో స్ట్రీమ్ అవుతున్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె సీజన్ 2 కు వచ్చారు.. ఈ సందర్భంగా బాలకృష్ణ భీమ్లా నాయక్ సినిమాకు మొదటగా ఎవరిని అనుకున్నారు అనే క్వశ్చన్ నాగ వంశీ ముందు ఉంచారు.. అయితే ఇందుకు స్పందించిన నాగ వంశీ సర్ ముందుగా మిమ్మల్ని కదా ఈ సినిమా కోసం అనుకున్న అయితే మీరు ఈ సినిమా చూసి ఇందులో పవన్ కళ్యాణ్ నటిస్తే బాగుంటుందని మాకు చెప్పారు కదా దాంతో మేము పవన్ కళ్యాణ్ ని కలిసి ఈ సినిమా అతనితోనే తీసాం అని చెప్పుకొచ్చారు.. అయితే ఈ సమయంలో బాలకృష్ణ ఈ విషయాన్ని ఎందుకు రివీల్ చేశారని విషయం ఎవరికీ అర్థం కాలేదు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుపాటి రానా ఎవరికి వారే అంటూ పోటీపడి నటించారు..