Ravindra Jadeja : ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. డిసెంబర్ 1,5 తేదీల్లో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్ధులను ప్రకటించింది. ఈ మేరకు 160 స్థానాలకు చెందిన అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. అ జాబితాలో రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా పేరును పేర్కొంది బీజేపీ.
2016 లో జడేజాను రివాబాను వివాహం చేసుకుంది. మూడేళ్ల క్రితం భాజపాలో చేరిన రివాబా… కర్నిసేన నాయకురాలిగా మంచి పేరు పొందింది. ఈమె ప్రముఖ రాజకీయ నేత హరి సింగ్ సోలంకి దగ్గరి బంధువు. కాగా ఇప్పుడు జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి రివాబా పోటీ చేయనున్నారు. అలాగే గుజరాత్ హోంశాఖ మంత్రి హర్ష సంఘవి … మజురా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన హార్ధిక్ పటేల్ .. విరాంగమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్…. ఘట్‌లోదియా స్థానం నుంచి పోటీ చేస్తారు. కాగా ఈ ఎన్నికల్లో 38మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు దక్కలేదు.
మోర్బీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు కూడా చోటు దక్కక పోవటం గమనించాల్సిన విషయం. ఈ జాబితాలో 14 మంది మహిళలతో పాటు 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే షెడ్యూల్స్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించి పలువురు ఉన్నారు. మాజీ సీఎం విజయ్ రూపానీ, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ సహా రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ నేతలు ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు.