ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్ 2024 సందర్భంగా, సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ, JNTUH, కూకట్‌పల్లి JNTUHలోని న్యూ IST సెమినార్ హాల్‌లో జ్ఞాపకశక్తిపై ప్రత్యేక సెమినార్‌ను నిర్వహించింది, దీనిని ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ నుండి JNTUH పూర్వ విద్యార్థి Dr. P Srinivas Kumar తీసుకున్నారు. ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఛాంపియన్‌షిప్ లకు చీఫ్ ఇన్‌ఛార్జ్‌గా Dr. P Srinivas Kumar నియమితులయ్యారు.
ముఖ్యఅతిథి అయిన Dr. G. Venkata Narasimha Reddy, Principal, UCESTH, JNTUH మాట్లాడుతూ… సమావేశాల సమయంలో ప్రతి శాఖలోని సిబ్బంది సంఖ్యను మరచిపోతూనే ఉన్నందు వలన తాను కూడా మెమరీకి సంబంధించి ఇటువంటి శాస్త్రీయ పద్ధతులను నేర్చుకోవల్సిన అవసరం ఉంది అన్నారు. గౌరవ అతిథి అయిన Dr. V. Padmavathi గారు, Vice-Principal, UCESTH, JNTUH మాట్లాడుతూ, 2023 లో బెంగళూరులో జరిగిన ఈ ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్ ఈ సంవత్సరం హైదరాబాద్‌లో జరగడం మా అదృష్టమని అన్నారు. విద్యార్థులు కూడా ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని తమ జ్ఞాపకశక్తిని ప్రదర్శించాలని ఆమె కోరారు.
బయోటెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ మరియు రీసెర్చ్ & డెవలప్‌మెంట్ సెల్ డిప్యూటీ డైరెక్టర్, JNTUH Dr. A Uma మాట్లాడుతూ… విద్యార్థులు సాధారణంగా తాము చదివిన ప్రతి విషయాన్ని గుర్తుంచుకోవడానికి సాంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తారని, అయితే వారు ఈ రకమైన శాస్త్రీయ పద్ధతులను ఉపయోగిస్తే, అది వారు పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు అపారమైన సమాచారం మొత్తాన్ని నిల్వ చేయడానికి సహాయపడుతుందని అన్నారు.
అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన క్రోనస్ ఫార్మా ప్రెసిడెంట్, ప్రత్యేక అతిథి అయిన Srikanth Thogarchedu తన వ్యాపార సమావేశాల్లో సంఖ్యలను గుర్తుంచుకోవడానికి ఎలా కష్టపడ్డాడో మరియు దానిని అధిగమించడానికి memory techniques నేర్పించిన Dr. P. Srinivas Kumar ఎలా కనెక్ట్ అయ్యాడో తన అనుభవాన్ని పంచుకున్నారు. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన Master Dhruv Thogarchedu చేసిన ప్రత్యేక లైవ్ మెమరీ ప్రదర్శన ప్రేక్షకులను అబ్బురపరిచింది. ప్రతి ఒక్కరూ memory techniques యొక్క శక్తిని మరియు academics లో ఈ పద్ధతుల యొక్క ఉపయోగాన్ని గ్రహించారు. Dhruv ఇప్పటికే రాబోయే ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్ 2024 కోసం నమోదు చేసుకున్నాడు మరియు అతను ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి మాత్రమే అక్టోబర్ 2024లో న్యూజెర్సీ నుండి మళ్లీ రానున్నాడు.
ఈ మెమరీ స్పోర్ట్‌ను ప్రోత్సహించడానికి, ఈ సంవత్సరం ఛాంపియన్‌షిప్ కోసం నమోదు చేసుకున్న వారికి Dr. P Srinivas Kumar వ్యక్తిగతంగా ఉచిత శిక్షణ ఇస్తున్నారు, ఇది గొప్ప అవకాశం. ఈ జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లో తమ విద్యార్థులకు ప్రాతినిధ్యం వహించడానికి పాఠశాలలు ముందుకు వచ్చి తమ విద్యార్థులను పంపించవలసిందిగా Dr. P. Srinivas Kumar కోరారు.
Dr. P. Srinivas Kumar మాట్లాడుతూ… JNTUH నుండి Biotechnology లో Ph.D చేసిన తాను ఈ memory sport ను దేశవ్యాప్తంగా విస్తరించి, ప్రతిభ గల వారిని కనుగొని శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నానని, తద్వారా ఒక రోజు భారతీయుడు ప్రపంచ మెమరీ ఛాంపియన్‌షిప్ గెలుపొందడం మనం చూడాలి అని, దానికి ప్రతి ఒక్కరి సహకారం కావలి అని కోరారు. తన లక్ష్యాన్ని ప్రోత్సహించడానికి తనకి ఈ అవకాశం ఇచ్చిన సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ, JNTUH లోని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా Dr. Archana giri, Professor, Head, CBT, Dr. L Saida, Associate Professor మరియు తన Ph.D గైడ్ మరియు తన తల్లి సమానురాలైన Dr. A Uma గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని తామై నడిపించిన సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ, JNTUH లోని ప్రతి ఒక్కరికి, విద్యార్ధులకు, ముఖ్యంగా తన స్నేహితుడు K Venkateswar Reddy కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్ 2024 నిర్వహించడానికి ఎంతో కీలకమైన volunteers, arbiters అందరూ ప్రతిష్టాత్మకమైన JNTUH నుండి రాబోవడం విశేషం.
పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్