Hansika : అందాల ముద్దుగుమ్మ హన్సిక గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. బాలీవుడ్ నుంచి సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన హన్సిక తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో తనదైన శైలిలో నటిస్తూ దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది ఈ భామ. అల్లు అర్జున్ నటించిన ‘దేశ ముదురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి విజయాలను సొంతం చేసుకుంది.
కాగా తెలుగుతో పాటు పలు తమిళ సినిమాల్లోనూ నటించి దక్షిణాదిలో టాప్ లెవెల్ కి చేరింది. ఇక హన్సిక గతంలో శింబుతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారాయి. ఆ తర్వాత వారి బ్రేకప్ అనంతరం సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మళ్ళీ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి.
ఈ ఏడాది డిసెంబర్లో జైపూర్ కోటలో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆమె తన పెళ్లి వేడుకకు అంతా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబరులో హన్సిక వివాహాన్ని నిర్వహించేందుకు ప్యాలెస్‌లో గదులు సిద్ధం చేస్తున్నామని, పనులు జరుగుతున్నాయని ప్యాలెస్‌కి చెందిన కొందరు సిబ్బంది వెల్లడించారు. సాంస్కృతిక సంపన్నమైన నగరానికి అతిథుల రాకకు ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నారు హన్సిక తల్లిదండ్రులు. జైపూర్ లోని ముండోటా కోటలోని ప్యాలెస్ వేదికగా హన్సిక వివాహం చేసుకోనుంది. కాగా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో ఆమె వివాహం జరగనుంది.