Anushka : క్వీన్ అనుష్క శెట్టి కి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సూపర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అనుష్క ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఆమె నటించిన అరుంధతి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో అనుష్కకు స్టార్ డమ్ వచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. స్వీటి నటించిన రుద్రమదేవి, బాహుబలి సినిమాలు ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి.
ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. దాంతో అనుష్క సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు. టాలీవుడ్ లో అనుష్క చివరిగా నటించిన నిశ్శబ్దం మూవీ… భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయింది. కాగా ఇటీవలే అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న కొత్త సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
అయితే ఈ సందర్భంగా ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనుష్క పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అనుష్క సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు యోగ టీచర్ గా చేసేదని అందరికీ తెలిసిందే. అయితే తాను మూడో తరగతి పిల్లల వరకు స్కూల్ లో పాఠాలు చెప్పేదాన్ని అంటూ మరో కొత్త విషయాన్ని పంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. టీచర్ గా చేస్తూనే యోగా క్లాస్ లు తీసుకునేదాన్ని అని అనుష్క తెలిపారు. ప్రస్తుతం అనుష్క చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.