Bigg Boss 6 : షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వీడియోల్లో నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది సిరి. ఇక బిగ్ బాస్ సీజన్- 5 లో టాప్- 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచింది. అయితే హౌస్ లో ఆటకంటే షణ్ముఖ్ తో రిలేషన్ షిప్ లో ఉందన్న రూమర్స్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఈ భామ. తాము మంచి స్నేహితులమని చెప్పుకున్నా వారి ప్రవర్తన చాలామందికి నచ్చలేదు. ఈ క్రమంలోనే షన్నుతో బ్రేకప్ చెప్పేసింది దీప్తి సునయన. వీరిద్దరూ విడిపోవడానికి కారణం సిరినే అని సోషల్ మీడియాలో ప్రచారం కూడా సాగింది. ఈ నేపథ్యంలో షన్ను- దీప్తి బ్రేకప్ కి కారణం తాను కాదని తేల్చి చెప్పింది సిరి. అయితే ఇప్పుడు ఈ సీజన్ లో ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కోసం బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది.
శ్రీహాన్, సిరిలు ఒకే చోట ఉంటున్నారు కానీ వారికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఆమెతో పాటు ఓ బుడ్డోడు కూడా హౌస్ లోకి వచ్చి వారిని మమ్మీ, డాడీ అని పిలుస్తున్నాడు. దీంతో ఆ పిల్లాడు ఎవరా అని అందరూ ఆరా తీస్తున్నారు. సిరి, శ్రీహాన్ దత్తత తీసుకుని పెంచుకుంటున్న చిన్నోడి పేరు చైతు. అయితే ఆ బాబు బయట వ్యక్తి కాదు. సిరి మేనమామ కొడుకు. ఈ విషయాన్ని స్వయానా సిరి తల్లి శ్రీదేవి గతంలో వెల్లడించారు. బిగ్ బాస్ సీజన్ 5లో సిరి ఇంట్లో ఉన్నప్పుడు లోపలికి వెళ్లారు ఆమె తల్లి శ్రీదేవి.
ఆపై బయటకు వచ్చిన ఆమె చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అప్పుడు ఈ చిన్నోడి ప్రస్తావన వచ్చింది. సిరి పెంచుకుంటున్న బాబు ఎవరో కాదు మా తమ్ముడి కొడుకే అంటూ సిరి శ్రీదేవి అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు. గతంలో బిగ్ బాస్ సీజన్ 5 ఇంట్లో ఉన్నప్పుడే సిరి కూడా ఈ బాబు గురించి చెప్పుకొచ్చింది.