Krithi Shetty : ఉప్పెన(Uppena) సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకుంది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు(Bangarraju) సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది కృతి శెట్టి. దీంతో అభిమానులని, ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంది. కానీ ఆ తర్వాత వరుసగా మూడు ఫ్లాప్స్ చూసింది. తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమాలో సెలెక్ట్ అయినా ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం కృతి చేతిలో మలయాళంలో టోవినో థామస్ సరసన చేస్తున్న సినిమా ఒకటే ఉంది.
దీంతో కృతి శెట్టి ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. స్టార్ హీరోయిన్ అయిపోతుంది, వరుస ఆఫర్స్ వస్తాయి అనుకుంటే ఇలా ఫ్లాప్స్ పడటంతో కృతి వైపు చూడట్లేదు దర్శక నిర్మాతలు. యాక్టింగ్ బాగానే చేసినా, డ్యాన్సులు కూడా పర్వాలేదనిపించినా, ఎక్స్ పోజింగ్ చేసినా, రొమాంటిక్ సీన్స్ చేసినా కృతికి మొదట్లో వచ్చినట్టు ఆఫర్స్ రావట్లేదు. మరి ఏమనుకుందో ఏమో సోషల్ మీడియాలో వరుసగా ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తుంది.
ఇటీవల వరుసగా డిఫరెంట్ డ్రెస్సుల్లో ఫోటోషూట్స్ చేసి హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది కృతి. ఈ ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఏకంగా ఆరు వారాల్లో 14 ఫోటోషూట్స్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కృతి. ఇంకా కొన్ని ఫోటోషూట్స్ ఉన్నాయని సమాచారం. ఈ ఫోటోషూట్స్ తో ఫాలోవర్స్ అయితే పెరుగుతున్నారు కానీ సినిమా ఆఫర్స్ మాత్రం డౌట్ గానే ఉంది. చూడాలి మరి వచ్చిన కొత్తలో లాగా కృతి శెట్టి మళ్ళీ ఎప్పుడు బిజీ అవుతుందో.