Naga Shaurya : సెకండ్ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కెరీర్ ఆరంభంలో ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద.. లాంటి మంచి సినిమాలతో మెప్పించాడు. గత కొంతకాలంగా మాత్రం వరుస ఫ్లాప్స్ చూస్తున్నాడు శౌర్య. మధ్యలో ఇటీవల వరుడు కావలెను, కృష్ణ వ్రింద విహారి సినిమాలు పర్వాలేదనిపించాయి. తాజాగా రంగబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు నాగశౌర్య.
నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా పవన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రంగబలి. ఈ సినిమా నేడు జులై 7న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో నాగశౌర్య తన అభిమానులకు ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేశాడు.అధి తన ఒకప్పటి కల గురించి … ఇంతకి అధి ఏంటి అంటే ,
నాగశౌర్య మాట్లాడుతూ.. నేను కాలేజీ టైంలో బాస్కెట్ బాల్ బాగా ఆడాను. నేషనల్స్ కూడా ఆడాను. పశ్చిమగోదావరి జిల్లా నుంచి నేషనల్ లెవల్ లో ఆడటానికి ఇద్దరు సెలెక్ట్ అయితే అందులో నేనొకడ్ని. బాస్కెట్ బాల్ ఆ రేంజ్ లో నేషనల్ లెవల్ లో చాలా సార్లు ఆడాను. ఇంటర్నేషనల్స్ కి కూడా వెళదామని కోచింగ్ కూడా తీసుకున్నాను. కానీ ఎందుకో నా వల్ల కాదనిపించి వదిలేశాను అని తెలిపాడు. దీంతో నాగశౌర్య బాస్కెట్ బాల్ నేషనల్స్ ఆడాడు అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. అదే ఫ్లోలో ఇంకొంచెం ప్రాక్టీస్ చేసి ఇంటెర్నేషనల్స్ కూడా ఆడాల్సింది అని పలువురు అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.