Sai Dharam Tej : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమాని రామ్ చరణ్ దర్శకుడితో చేయబోతున్నాడంటూ ఇటీవల ఒక వార్త బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తో ‘రచ్చ’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన సంపత్ నంది.. తేజ్ తో ఒక సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, త్వరలోనే మూవీని అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వినిపించాయి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ కోసం పూజా హెగ్డే (Pooja Hegde) శ్రీలీల (Sreeleela) ను సంప్రదించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ మూవీ టైటిల్ అండ్ హీరోయిన్ కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఫైనల్ చేసినట్లు ఫిలిం వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. అలాగే ఈ మూవీకి మాస్ టైటిల్ ని ఖరారు చేశారు. గతంలో పవన్ ‘గుడుంబా శంకర్’ టైటిల్ గుర్తుకు ఉండే ఉంటది. ఇప్పుడు అదే తరహాలో ‘గంజా శంకర్’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. కాగా సంపత్ నంది ఇటీవలే గోపీచంద్ తో ‘సీటిమార్’తో సూపర్ సక్సెస్ ని అందుకొని హిట్ ట్రాక్ లో ఉన్నాడు.
సాయి ధరమ్ కూడా ‘విరూపాక్ష’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా 100 కోట్ల క్లబ్ లోకి కూడా అడుగుపెట్టాడు. ఇప్పుడు Bro సినిమాతో మరోసారి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి సిద్దమవుతున్నాడు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో కలిసి చేస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ కథాంశంతో వస్తుంది. తమిళ్ సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. జులై 28న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.