Sudigali Sudheer : తెలుగు ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ టీవీ ఛానల్ లో ప్రాసం అవుతున్న జబర్ధస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరపై మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సుధీర్… పలు రియాల్టీ షోలకు యాంకర్ గానూ పనిచేశారు. అలానే పలు చిత్రాల్లో సహాయక పాత్రలలో కూడా నటించారు. ఇక ప్రస్తుతం సుధీర్ నటించిన గాలోడు సినిమా నవంబర్ 18న విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించిన ఈ మూవీలో గెహ్నా సిప్పి హీరోయిన్గా నటించింది. సంస్కృతి ఫిలింస్ నిర్మించిన ఈ సీన్ ఇమలో సప్తగిరి, శకలక శంకర్, తమ్మారెడి భరద్వాజ, పృధ్వీ పలు కీలక పాత్రల్లో నటించారు.
అయితే ఈ సినిమాకు సంబంధించి సుధీర్ రెమ్యూనరేషన్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా మారిన సుధీర్… ఆ తర్వాత 3 మంకీస్ సినిమాలో నటించారు. అయితే ప్రస్తుతం గాలోడు చిత్రానికి రూ. 40 నుంచి 50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 2 నుంచి రూ. 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా టాక్ నడుస్తుంది.
ఈ మేరకు ఇటీవల నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్ లో తనను ఇంట్లో ఒకడిగా ఆదరిస్తోన్న తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటానని… ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి తన ఆఖరి శ్వాస వరకు ప్రయత్నిస్తానని సుధీర్ అన్నారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి, తనది వన్‌మ్యాన్ షో అని ప్రేక్షకులు అనడానికి కారణం డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి అని సుధీర్ చెప్పారు. ఆ క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కుతుందని స్పష్టం చేశారు. కొద్ది కాలంగా జబర్ధస్త్ షోకు దూరంగా ఉంటున్న సుధీర్ తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.