Yadamma Raju : టాలీవుడ్ కమెడియన్ యాదమ్మ రాజు.. ‘పటాస్’ కామెడీ షోతో మంచి ఫేమ్ ని సంపాదించుకున్నాడు. ఆ తరువాత కూడా పలు టీవీ షోల్లో నటిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపుని పొంది సినిమా అవకాశాలను సైతం అందుకున్నాడు. ఇక గత ఏడాది తాను ప్రేమించిన అమ్మాయి ‘షార్లీ స్టెల్లా’నే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక షో ద్వారా తెలియజేశాడు. 2022 నవంబర్ లో నిశ్చితార్ధం చేసుకున్న వీరిద్దరూ.. డిసెంబర్ లో ఏడడుగులు వేశారు. ఈ పెళ్ళికి నాగబాబు, అశ్విన్ బాబు, ఆకాష్ పూరీ, యాంకర్ ప్రదీప్ వంటి స్టార్స్ కూడా హాజరయ్యి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక ఈ పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి పలు టీవీ షోల్లో కూడా కనిపించారు. అయితే కొన్ని రోజులు నుంచి వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు నెట్టింట పుకార్లు వినిపిస్తున్నాయి. పెళ్ళై సంవత్సరం కూడా కాకముందే విడాకులు ఏంటని? అసలు ఇది నిజమేనా? అని సోషల్ మీడియాలో యాదమ్మ రాజుని క్యూస్షన్ చేస్తున్నారు. దీంతో ఆ జంట స్పందిస్తూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. తాము విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలియజేశారు.
ప్రముఖ టీవీ ఛానల్ ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీ షో కోసం ఒక ప్రాంక్ కాన్సెప్ట్ చేశారని, అందులో భాగంగానే డైవర్స్ అనే థీమ్ ని తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. షోలో భాగమే తప్ప తాము ప్రస్తుతం బాగానే ఉన్నట్లు, ఆ ఫేక్ వార్తలను నమ్మొద్దు అంటూ వీడియోలో పేర్కొన్నారు. దీంతో యాదమ్మ రాజు విడాకుల వార్తలకు చెక్ పడింది.