Balakrishna : బాలకృష్ణ ప్రస్తుతం ఆయన అభిమానులందరికి ఫుల్ మీల్స్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నారు. సినిమాలు, టాక్ షో, రాజకీయాలు అన్నీ బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. బాలయ్య 108వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. కాగా వచ్చే ఏడాది నుంచి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు “రామారావు గారు” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ ఫిల్మ్ నగర్ లో సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ మూవీలో బాలయ్య సరసన నటించేందుకు బాలీవుడ్ బ్యూటీ ‘సోనాక్షి సిన్హా’ని తీసుకోబోతున్నారని టాక్ నడిపిస్తుంది. మేకర్స్ మొదట రకుల్ ప్రీత్‌ను సంప్రదించగా… ఆమె డేట్స్ అందుబాటులో లేకపోవడంతో మూవీ టీం ఈమెను హీరోయిన్ ని సంప్రదించారట. అయితే ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా ఈ సినిమాలో బాలయ్య కుమార్తెగా శ్రీలీల మరియు కీలక పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు.
సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమా పూర్తీ చేసే పనిలో ఉన్నాడు. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతికి బాలయ్యకు పోటీగా చిరు నటిస్తున్న వాల్తేరు వాసు రానుంది.